సహకారం సమరం
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:07 AM
తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారా నికి సహకార సంఘాల ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు.
ఈ నెల 6 నుంచి జనవరి 5 వరకు కార్యాచరణ
డిమాండ్ల పరిష్కారానికి ఉద్యోగుల పోరాటం
ముదినేపల్లి, డిసెంబరు 3(ఆంధ్రజ్యో తి): తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారా నికి సహకార సంఘాల ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ జేఏ సీ ఈ నెల 6 నుంచి జనవరి ఐదో తేదీ వరకు చేపట్టనున్న ఆందోళన కార్యక్రమా లను నాయకులు ప్రకటించారు. డీసీసీబీ పరిధిలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 260 పీఏసీఎస్‌ల్లో 1,100 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 260 మంది సంఘాల సీఈవోలు, 840 మంది ఇతర ఉద్యోగులు. ఆందోళనల్లో భాగంగా 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. 8న డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద, 16న జిల్లా సహకార శాఖాధికారి కార్యాల యాల వద్ద, 22న డీసీసీబీ ప్రధాన కార్యా లయాల వద్ద ధర్నాలు చేస్తారు. 29న విజయవాడలో మహాధర్నా, జనవరి 5 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టను న్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కార మయ్యే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ నేత బి.రఘురామ్ అన్నారు.
ఇవీ డిమాండ్లు
జీవో 36 అమలు చేయాలి.
ప్రతి ఐదేళ్లకు వేతన సవరణ జరగాలి.
పెండింగ్ వేతన సవరణలపై చర్యలు తీసుకోవాలి.
ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి.
రూ.5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా కల్పించాలి.
ఉద్యోగుల డ్యూటీ పద్దులను రద్దు చేయాలి.
2019 తర్వాత చేరిన ఉద్యోగు లను రెగ్యులర్ చేయాలి.
2011 నుంచి రైతులకు డివిడెండ్ చెల్లించాలి.
నిబంధనల ప్రకారం ఉద్యో గులను బదిలీ చేయాలి.
జీతాలను డీఎల్‌ఎస్‌ఎఫ్ ద్వారా చెల్లించాలి.
సీనియార్టీ ప్రకారం ఉద్యోగులను సంఘాల సీఈవోలుగా నియమించాలి.