Share News

ఆక్సిజన్‌ కొరత..చేపలు మృత్యువాత..

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:09 AM

తుఫా న్‌ ప్రభావంతో మూడురోజులుగా కురు స్తున్న వర్షాల వల్ల చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో చేపలు మృత్యువాత పడు తున్నాయి.

ఆక్సిజన్‌ కొరత..చేపలు మృత్యువాత..
పెదలంకలో హడావుడిగా పట్టుబడులు

వర్షాలతో చెరువుల్లో చల్లబడుతున్న నీరు

ఖరీదైన మందులు వాడుతున్నా ఫలితం శూన్యం

రైతులు నష్టాల బాట

కలిదిండి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి):తుఫా న్‌ ప్రభావంతో మూడురోజులుగా కురు స్తున్న వర్షాల వల్ల చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో చేపలు మృత్యువాత పడు తున్నాయి. కలిదిండి మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు చేపల సాగు చేస్తున్నా రు. మూలలంక, మట్టగుంట, భాస్కరరావుపేట, కొండగి, కలిదిండి, కొత్తూరు, సంతోషపురం గ్రామాల్లో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి పెద్దసైజు చేపలు చనిపోతుండడంతో హడా విడిగా పట్టుబడి చేసి అయిన కాడికి అమ్ము కుంటున్నారు. చనిపోతున్న చేపలను స్థాని కంగా వ్యాపారులు కొనుగోలు చేయక పోవ డంతో ఏలూరు, ఆకివీడు మార్కెట్‌లకు తరలి స్తున్నారు. ఆక్సిజన్‌ కొరత నివారణకు ఖరీదైన మందులు వాడుతున్నా ఫలితం లేదని, ఎకరా నికి రూ.2 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామ ని, కనీసం పెట్టుబడులు రావడం లేదని వాపో తున్నారు.

పెదలంకకు చెందిన ముద్దం వీరాస్వామి 50 ఎకరాల్లో చేపల సాగు చేస్తుండగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడి చేపలు మృత్యువాత పడడంతో సుమారు రూ.30 లక్షలు నష్టం వాటిల్లింది. సంతోషపురానికి చెందిన ఓ రైతుకు చెందిన 20 ఎకరాల చెరువులో చేపలకు శెంకుజలగవ్యాధి సోకి చనిపోతున్నాయి. కొండంగిలో ఒక రైతుకు చెందిన 30 ఎకరాల చెరువులో ఆక్సిజన్‌ లోపిం చి చేపలు మృత్యువాత పడడంతో సుమారు రూ.25 లక్షలు నష్టం వాటిల్లింది. చేపల చెరు వులకు బీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆక్వా రైతులు కోరుతున్నారు.

చేపల చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత నివారణకు హైట్రోజన్‌ పెరాక్సైడ్‌ ఎకరానికి కిలో చొప్పున చల్లాలని మండల మత్స్యశాఖాధికారి రవికుమా ర్‌ తెలిపారు. చెరువుల్లో ఏరియేటర్లు నిరంత రాయంగా తిరుగుతూ ఉండాలన్నారు. ఉద యాన్నే బోటులను తిప్పుతూ ఆయిల్‌ ఇంజ న్లతో నీటిని రీసైక్లింగ్‌ చేయాలన్నారు. మేతలు తక్కువగా వేయాలన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:09 AM