Share News

మాది సుపరిపాలన

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:05 AM

‘ఇప్పటికే అనేక పథకాలకు అంకురార్పణ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందరికీ సంతృప్తి కరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేసే ప్రభుత్వం మాది’.. అని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

మాది సుపరిపాలన
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పార్థసారథి

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

పోలవరం త్వరలోనే పూర్తి చేస్తాం

మెగా డీఎస్సీతో సహా అందరికీ ఎన్నో మేళ్ళు

పీ 4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమే

స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం

వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం

ప్రజలు మెచ్చేలా చేరువలో పాలన

స్వాతంత్య్రదిన వేడుకల్లో మంత్రి పార్థసారథి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

‘ఇప్పటికే అనేక పథకాలకు అంకురార్పణ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందరికీ సంతృప్తి కరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేసే ప్రభుత్వం మాది’.. అని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 79వ స్వాతంత్య్రదిన వేడుకల సంద ర్భంగా శుక్రవారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా బాగుంటుంది. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ రద్దు, సామాజిక పింఛన్లు రూ.నాలుగు వేలకు పెంపు, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమా లను అమలు చేశాం. స్వాతంత్య్ర దినోత్సవ వేళ స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారం భిస్తున్నాం. జిల్లాలో 190 బస్సుల్లో మహిళలకు ఉచిత రవా ణ సౌకర్యం అందించే అవకాశం ఉంది. సుమారు 57 వేల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానం. సమా జంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. పీ–4 విధానంలో పేదరిక నిర్మూలన సాధనకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ అనేది ఆర్థికాభి వృద్ధి, సామాజికాభివృద్ధి, పర్యావరణ సుస్థిరతలపై దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఏపీ ప్రధాన వృద్ధి కేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక, కార్యాచరణ నిర్దేశిస్తుంది’ అని పేర్కొన్నారు.

కుడి కాలువ పూర్తి చేస్తాం..

పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పనులు 92.79 శాతం పూర్తి చేయడమే కాకుండా కృష్ణా డెల్టా ఆయకట్టును సంరక్షించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 442 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించాం. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన పంప్‌ హౌస్‌ల పనులు పూర్తి చేయడమే కాకుండా లక్షా 57 వేల 544 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాం. జల వనరుల శాఖ ద్వారా ఓఅండ్‌ఎం పథకం కింద రూ.9 కోట్ల 11 లక్షల వ్యయంతో తూడు తొలగింపు పనులు పూర్తి చేశాం. జపాన్‌ బ్యాంక్‌ ఆర్థిక సాయంతో తమ్మిలేరు ప్రాజెక్టు మోడరైజేషన్‌కు రూ.16 కోట్ల 8 లక్షలతో పనులు పురోగతిలో ఉన్నాయి. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం రావులచెరువును రూ.94 లక్షలతో అభివృద్ధి చేశాం. జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో 82,108 గృహాలు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకంలో 19,581 గృహాలు, పీఎం జన్‌మన్‌ పథకంలో 556 గృహాలు మొత్తం మీద లక్షా 32 వేల 237 గృహాలను రూ.1,840.27 కోట్లతో మంజూరు చేశాం. ఇంతవరకు 44,533 గృహాల నిర్మాణం పూర్తి చేశాం. 2014–19 మధ్య మంజూరు కాబడిన పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను దశల వారీగా చెల్లిస్తున్నాం. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఈ విధానాన్ని ఈరోజే తీసుకొస్తున్నాం. వాట్సప్‌ నంబర్‌ 95523 00009 ద్వారా 700 సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి’ అంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నదుల అనుసంధానంలో కీలకమైన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేం దుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటు న్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనకు తొలి రోజు నుంచి నాంది పలికింది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం.

– మంత్రి కొలుసు

ఆకట్టుకున్న ప్రగతి శకటాల ప్రదర్శన

ఏలూరు రూరల్‌/ఏలూరు క్రైం : స్వాతంత్య్రదిన వేడుకల్లో భాగంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన ‘ప్రగతి శకటాల’ ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యా శకటానికి ప్రథమ, వ్యవసాయశాఖ శకటానికి ద్వితీయ, గృహ నిర్మాణశాఖ శకటానికి తృతీయ బహుమతులు లభించాయి. సంబంధిత శాఖల అధికారులను మంత్రి కొలుసు పార్థసారథి కలెక్టర్‌ వెట్రిసెల్వి అభినందించి బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.

పటిష్ఠ బందోబస్తు

కాగా జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిశోర్‌ ఆదేశాలతో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ చుట్టూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లో వెళ్లే ప్రతి ఒక్కరిని మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. స్టేజీ వద్ద నాలుగువైపులా డిస్ట్రిక్ట్‌ గార్డులతో భద్రతను ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 16 , 2025 | 01:06 AM