Share News

ఉగ్రవాదాన్ని అణిచివేద్దాం

ABN , Publish Date - May 08 , 2025 | 11:54 PM

‘ఉగ్రవాదాన్ని అణిచివేద్దామని, భారత్‌ కన్నెర్ర చేస్తే ఉగ్రవాదం తోక ముడుచుకోవాల్సిందేనని ప్రధాని మోదీ నిరూపించారని, ఉగ్రవాదుల వ్యతిరేక పోరాటంలో భారత్‌ చరిత్రా త్మకంగా నిలిచింది’ అని పలువురు వక్తలు అన్నా రు.

ఉగ్రవాదాన్ని అణిచివేద్దాం
క్విట్‌ ఇండియా స్తూపం వద్ద హర్షం ప్రకటిస్తున్న ప్రముఖులు..

భీమవరం క్విట్‌ ఇండియా స్తూపం వద్ద ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై పలువురు వక్తల హర్షం

భీమవరంటౌన్‌, మే 8(ఆంఽధ్రజ్యోతి): ‘ఉగ్రవాదాన్ని అణిచివేద్దామని, భారత్‌ కన్నెర్ర చేస్తే ఉగ్రవాదం తోక ముడుచుకోవాల్సిందేనని ప్రధాని మోదీ నిరూపించారని, ఉగ్రవాదుల వ్యతిరేక పోరాటంలో భారత్‌ చరిత్రా త్మకంగా నిలిచింది’ అని పలువురు వక్తలు అన్నా రు. భీమవరం క్విట్‌ ఇండియా స్తూపం వద్ద శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై హర్షం తెలుపుతూ కార్యక్ర మాన్ని నిర్వహించారు. నరసాపురం పార్లమెంట్‌ బీజేపీ ఇన్‌ఛార్జి పేరిచర్ల సుభాష్‌రాజు, అల్లూరి సాయి దుర్గరాజు, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఉగ్ర మూకలపై భారత్‌ రుద్ర తాండవం చేసిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఆరేటి ప్రకాశ్‌, ఉండపల్లి రమేష్‌నాయుడు మాట్లాడుతూ పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ సాహ సోపేత చర్యగా నిలిచిందన్నారు. యూత్‌ క్లబ్‌ సభ్యులు కేఎస్‌ఎన్‌ రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, చల్లా రాము, కలిగొట్ల గోపాల శర్మ, అడవి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడు : పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన కిరాతక చర్యకు ప్రతీకారంగా భారత్‌ నిర్వహించి ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల టీబీఆర్‌ సంస్థ చైర్మన్‌ తనుబుద్ది భోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సైన్యం త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్రవావుదల స్థావరాలపై దాడులు నిర్వహించి ప్రతీ కారం తీర్చుకున్నారన్నారు.

పాలకొల్లు అర్బన్‌: పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయించడం హర్షనీయమని బీజేపీ పట్టణ నాయకులు అన్నారు. పట్టణ అధ్యక్షుడు కొల్లి కొండప్రసాద్‌, సీనియర్‌ నాయకులు ఉన్నమట్ల కపర్ధి, జక్కంపూడి కుమార్‌, చెరుకూరి శ్రీనివాస్‌, మల్లవోలు సురేష్‌ తదితరులు గురువారం మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ సాహసోపేతమైన చర్య అన్నారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాఽథ్‌ సింగ్‌, హోమ్‌ మంత్రి అమిత్‌షాలను అభినందించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ తగిన బుద్ది చెప్పిందని బీజేపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొ న్నారు. తాడేపల్లిగూడెంలోని బీజేపి కార్యాలయం వద్ద బుధవారం నియోజకవర్గ ఇన్‌చార్జి ఈతకోట తాతాజి అధ్యక్షతన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. ప్రతీ పౌరుడు పాక్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండా లన్నారు. బీజేపీ నాయకులు కర్రి బాలాజి, పెదపోలు వీరరాఘవలు, కొండపల్లి నగేష్‌, దువ్వ శ్రీను, మాట్లాడారు.

ఆర్మీకి అయ్యప్ప అనుగ్రహం ఉండాలి

తణుకు : భారత ఆర్మీకి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. గురువారం బైపాస్‌ రోడ్డులోని శ్రీషాస్తా పంచాయత అయ్యప్పస్వామి ఆలయంలో విశేష అన్నాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత్‌–పాక్‌ మద్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీకి స్వామి అనుగ్రహం ఉండాలని పూజలు నిర్వహించారు. సైనికుల్లో ధైర్యసాహసాలను పెంపొందించేలా అభినందిం చాలని వివరించారు. ఆలయ గురు స్వామి చలపతి స్వామి, చల్లా భరణిలతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:05 AM