ఉల్లి కిలో రూ.10
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:59 PM
ఏడాదిగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి దిగి వచ్చింది. నిన్నటి వరకూ రూ.30 వరకూ విక్రయించగా ఒక్కసారిగా ధర లు దిగి వచ్చి రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.10కే విక్రయిస్తున్నారు.
కర్నూలు, మహారాష్ట్ర నుంచి దిగుమతుల జోరు
దిగొచ్చిన ధర
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఏడాదిగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి దిగి వచ్చింది. నిన్నటి వరకూ రూ.30 వరకూ విక్రయించగా ఒక్కసారిగా ధర లు దిగి వచ్చి రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.10కే విక్రయిస్తున్నారు. ఎ గ్రేడు రకం రూ.12 పలుకు తోంది. దీంతో ఉల్లికొనుగోలు చేసేందుకు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారు. ఉల్లి దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్‌కు మహారాష్ట్ర ఉల్లి జోరుగా దిగుమతి అవుతోంది. ప్రస్తుతం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు 15 లోడులు దిగుమతి అవుతున్నాయి. దీంతో పెద్ద వ్యాపారులు నిల్వ ఉండే ఉల్లిని కొనేందుకు ఆసక్తి చూపుతూ నిల్వ చేసేందుకు చూస్తున్నా రు. ఉల్లి ధర వర్షాకాలం వచ్చేవరకూ నిలకడగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ధర ఎప్పుడు పెంచేస్తారో అని సామాన్యులు సైతం బస్తాలకు బస్తాల ఉల్లి కొనుగోలు చేసుకునేం దుకు ఆసక్తి చూపుతున్నారు.