అన్నింటికి ఒక్కరేనా..?
ABN , Publish Date - May 11 , 2025 | 12:57 AM
సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో (హాస్టల్స్) సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితం గా ఇటు విద్యార్థులు, అటు వార్డెన్స్ ఇబ్బందు లు పడుతున్నారు.
అన్ని పనులు వార్డెనే చేసుకోవాలి..
విద్యార్థులపై చదువులతోపాటు వంట, క్లీనింగ్ పనుల భారం
తణుకు రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో (హాస్టల్స్) సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితం గా ఇటు విద్యార్థులు, అటు వార్డెన్స్ ఇబ్బందు లు పడుతున్నారు. ఈ హాస్టల్స్‌లో ఒకటి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు చదువుకునే విద్యా ర్థులు ఉంటారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల హాస్టల్స్‌లో ఒక వార్డెన్, కుక్, కమాటి, వాచ్‌మెన్‌లు ఉన్నారు. కాని ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీ రింగ్, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థుల హాస్టల్స్‌లో మాత్రం వార్డెన్ ఒక్కరే వున్నారు. ఆ నాలుగు పనులు ఈ వార్డె నే చూసుకోవాల్సి రావడంతో విద్యార్థులు, వార్డె న్స్ ఇబ్బంది పడుతున్నారు. కుక్, కమాటీలు లేకపోవడంతో కొందరు వార్డెన్‌లు హాస్టల్స్ విద్యార్థుల నుంచి కొంత మొత్తం సేకరించి వంట మనుషులను ఏర్పాటు చేశారు. కుక్‌లు దొరకని చోట వార్డెన్‌లే వంట చేస్తూ విద్యార్థు లతో పనులు చేయుస్తున్నారు. ఒకవైపు కళాశా లల్లో చదువు, ఇతర అంశాలలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు హాస్టల్స్‌లో పనులు, ఇతర వేధింపులతో సతమతం అవుతున్నారు. మహిళల హాస్టల్స్‌లో చదివే విద్యార్థినులకు చదువులతోపాటు హాస్టల్స్ పనుల భారం తోడైంది. ఈ క్రమంలో కొందరు మధ్యలోనే హాస్టల్స్‌ను వదిలి వెళ్లాల్సి వస్తోంది. అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు జరిగినట్లే ఎస్సీ హాస్టల్స్‌లోను సిబ్బందిని నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎస్సీ కళాశాలల వసతి గృహాల్లో విద్యార్థుల సౌకర్యం కోసం సిబ్బందిని నియమించాలి. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యనందించాలి’ అని మండపాకకు చెం దిన కె.బాబూరాజేంద్రప్రసాద్ కోరుతున్నారు.
ఇది రాష్ట్రవ్యాప్త సమస్య
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో 35 వసతి గృహాలను నిర్వహిస్తు న్నారు. వాటిలో కళాశాల విద్యార్థులకు 13 ఉన్నాయి. 686 మంది విద్యార్థులకు గాను, 334 మంది యువకులు, 352 మంది బాలి కలు వున్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ, పాలి టెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న వారు. వాటిలో ఒక్క వార్డెన్ మాత్రమే ఉం టారు. చిన్న పిల్లల హాస్టల్స్‌లో వార్డెన్‌తో పాటు ఇతర సిబ్బంది వుంటారు. ఇది రాష్ట్రవ్యాప్త సమస్య.
– బి.రామాంజనేయరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి, భీమవరం.