Share News

జిల్లా కేంద్రంలో మరో కొవిడ్‌ కేస్‌

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:39 AM

జిల్లా కేంద్రం ఏలూరులో కొవిడ్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది.

 జిల్లా కేంద్రంలో మరో కొవిడ్‌ కేస్‌

ఏలూరు అర్బన్‌, జూన్‌ 3 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా కేంద్రం ఏలూరులో కొవిడ్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఒక మహిళ(55)కు మంగళవారం కొవిడ్‌ పాజి టివ్‌ నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్యశాఖ ఐడీఎస్‌పి వైద్యాధికారి నరేంద్రకృష్ణ తెలి పారు. జ్వరం, జలుబు, తదితర కొవిడ్‌ లక్షణాలతో ఆమె ప్రభుత్వ సర్వజన ఆసు పత్రికిరాగా వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధా రణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలే షన్‌లో ఉన్నారు. జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య 12కి చేరింది. ఏలూరు శాంతినగర్‌కుచెందిన ఇద్దరు దంపతులు విజయవాడ ఆసుపత్రి నుంచి ఆరోగ్యంతో మంగళవారం డిశ్చార్జి అయ్యారు.

పుణె ల్యాబ్‌కు రెండు శాంపిల్స్‌

జిల్లాలో కొవిడ్‌ బాధితులకు సోకిన వైరస్‌ వేరియంట్‌ తెలుసుకునేందుకు ఇద్దరి శ్వాబ్‌లను పుణెలోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌ నివేదిక రావడానికి 14రోజుల వ్యవది పడుతుందని డాక్టర్‌ నరేంద్రకృష్ణ తెలిపారు.

Updated Date - Jun 04 , 2025 | 12:39 AM