పోలసానిపల్లి గురుకులానికి రూ.కోటి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:35 AM
ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకోని 35 ఏళ్ల నాటి గురుకుల పాఠశాల సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వే స్తోంది.
సీఎం చంద్రబాబు హామీ అమలు
సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మరో రూ.50 లక్షలు
భీమడోలు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకోని 35 ఏళ్ల నాటి గురుకుల పాఠశాల సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వే స్తోంది. ఇటీవల ఉంగుటూరులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నియోజకవర్గ సమస్యలను సీఎంకు విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరారు. దానిలో భాగంగా పోలసానపల్లి గురుకుల పాఠశాల సమస్యలను విన్నవించారు. సభ జరిగిన 20 రోజుల్లోనే గురుకుల పాఠశాల అభివృద్ధికి డీఎంఎఫ్ నిధులు కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో పాటు డార్మెటరీ, డైనింగ్‌హాల్ మరమ్మతులకు మరో రూ.50 లక్షలు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మంజూరయ్యాయి. తొలుత పాఠశాల ఆవరణ లో కొన్ని తరగతి గదుల నిర్మాణం చేపట్టేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన తరగతి గదులు 16 ఉండగా మొత్తం నిర్మాణా లకు సుమారు రూ.20 కోట్లకు పైగా వెచ్చించా ల్సి ఉంది. ఆట స్థలం అభివృద్ధికి నిధులు కావాల్సి ఉంది.