మునిసిపల్ ఆస్తులపై నిఘా
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:40 PM
పట్టణాల్లో మునిసిపల్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
అన్యాక్రాంతం కాకుండా చర్యలు
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు
వీటి సేకరణకు కమిటీల ఏర్పాటు
15 రోజుల్లో నివేదికల సమర్పణ
కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశం
భీమవరం టౌన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో మునిసిపల్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మునిసిపాల్టీలకు వున్న స్థిర, చరాస్తులను ఆన్‌లైన్‌లో ఎం టర్‌ప్రైజ్ రిపోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ) నమోదు ద్వారా భవిష్యత్తులో అవి అన్యాక్రాంతం కాకుం డా రక్షణ ఉంటుంది. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు తూతూమంత్రంగా ఉండడంతో ఆ ఆస్తులకు రక్షణ లేకపోయింది. రిజర్వుస్థలాలు ఆక్రమణలకు గురికావడం, దొంగ దస్తావేజుల తో వాటికి రిజిస్ర్టేషన్లు చేయించిన సంఘటనలు వున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం చరాస్తులపై దృష్టి పెట్టింది. మునిసిపాల్టీకి చెందిన ప్రతీ అంగుళం ఈఆర్‌పీలో నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మునిసిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీలో కమిషనర్లు కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. కమిటీల్లో టౌన్ ప్లానర్, ఇంజనీర్లు, అసిస్టెంట్ కమిషనర్లతో పాటు పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లోని అధి కారులు, సిబ్బంది వుంటారు. వీరంతా మునిసి పాలిటీకి పట్టణంలో ఎక్కడెక్కడ ఆస్తులు వున్నా యో పరిశీలన చేసి 15 రోజుల్లో నివేదికలు రూపొందించి కమిషనర్‌కు అందజేస్తారు. ఆపై ఆన్‌లైన్‌లో నమోదు చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు.
మునిసిపల్ ఆస్తులపై సూచన
మునిసిపాల్టీ పరిధిలోని అన్ని స్థిర, చరాస్తు లను నమోదు చెయ్యాలి.
ఇప్పటివరకు వున్న ఆస్తుల వివరాలను పరిశీ లించి పొరపాట్లను సరిదిద్దాలి.
కొత్తగా వచ్చిన, సేకరించిన ఆస్తులు నమోదు చేయాలి.
ఆస్తుల విలువ, వర్గీకరణ, యాజమాన్యం, పన్నులు, రికార్డులు, రిజిస్టర్లు, కౌన్సిల్ తీర్మానాలు, వ్యక్తిగత తనిఖీలు ఆఽధారంగా ధ్రువీ కరణ ఇవ్వాలి.
ఆస్తుల వివరాలపై టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, మునిసిపల్, రెవెన్యూ, పారిశుధ్య విభా గాలు కలిసి ధ్రువీకరణ ఇవ్వాలి.
ఈ నమోదులో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటారు.