Share News

నూజివీడును ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:40 AM

నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో విలీనం చేయాలని కోరు తూ నూజివీడు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయ వాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

నూజివీడును ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలి
నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

నూజివీడు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో విలీనం చేయాలని కోరు తూ నూజివీడు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయ వాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.కోర్టు హాలు నుంచి న్యాయవాదులు బైక్‌ ర్యాలీ చేపట్టగా ఆర్టీసీ బస్టాండు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాలకులు ఇచ్చిన హామీని నెర వేర్చాలంటూ నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూజివీడు నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా హామీని అమలు చేయలేదని, తక్షణం హామీని అమలుపరచాలని వారు డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మన్నెం రమేష్‌, మాజీ అధ్యక్షుడు ఇందుపల్లి సత్యప్రకాష్‌, పలువురు సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:40 AM