‘నూజివీడు’ను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:31 AM
నూజివీడు నియోజక వర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. గురువారం ఈ దీక్షలను నూజివీడు జేఏసీ గౌరవ అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కొమ్మన నాగేశ్వరరావు ప్రారంభించారు.
జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు
నూజివీడు టౌన్, నవంబరు27(ఆంధ్రజ్యోతి):నూజివీడు నియోజక వర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. గురువారం ఈ దీక్షలను నూజివీడు జేఏసీ గౌరవ అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కొమ్మన నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చలసాని రామారావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని, గతంలో కరోనా కాలంలో ఎన్నో పోరాటాలు చేశామని, గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో నూజివీడును ఏలూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఏడాదిపాటు పెద్దఎత్తున ప్రజా పోరాటం చేశామన్నారు. దీనిలో భాగంగా ధర్నాలు, నిరాహార దీక్షలు, 72 గ్రామాల్లో జీపు యాత్రతోపాటు లక్ష కరపత్రాల పంపిణీ, 25 వేల సంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్ నిర్వహించి నూజివీడు నుంచి విజయవాడకు పాదయాత్రగా వెళ్లి అప్పటి కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. నూజివీడు జేఏసీ అధ్యక్షుడు మరిదు శివరామకృష్ణ, నూజివీడు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇందుపల్లి సత్యప్రకాష్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2023లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా నూజివీడు వచ్చినప్పుడు, 2024 ఎన్నికల ప్రచార సభకు వచ్చినప్పుడు బహిరంగ సభలో హామీ ఇచ్చారన్నారు. నూజివీడు ప్రజల ఆకాంక్షలు ఇక్కడ పుట్టి పెరిగిన వారికి మాత్రమే తెలుస్తా యని, దీనికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా ప్రజల ఆగ్రహా నికి గురికావడం తప్పదన్నారు. ఇప్పటికైనా సానుకూలంగా నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలిపి పూర్వవైభవం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీపుల్స్ ఫోరం నా యకులు పిన్నమనేని కుమార్, సబ్బినేని శ్రీని వాస్, సిద్ధార్థ రవి, రాజశేఖర్, ఫరూక్, నూజివీడు జేఏసీ కోశాధికారి చాట్ల పుల్లారావు, జేఏసీ నాయకులు ఎం.సునీల్‌కుమార్, ఎర్రంశెట్టి రాము, నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షు డు మన్నవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.