ఇక ప్రభుత్వ పాఠశాలలకు.. ఉచిత విద్యుత్ !
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఏళ్ల తరబడి నిధులకోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు తీపికబురు.

జిల్లాలో 1744 ప్రభుత్వ పాఠశాలలు
ఏలూరు అర్బన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఏళ్ల తరబడి నిధులకోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు తీపికబురు. ఇక మీదట విద్యుత్ బిల్లులకోసం ప్రభుత్వమిచ్చే నిధుల కోసం ఎదురుచూడడం, ఈలోగా సొంత జేబు నుంచి బిల్లులను చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను ఇచ్చే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది.
వివరాల సేకరణ పూర్తి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల (ఎయిడెడ్ మినహా)కు ప్రస్తుతం వున్న విద్యుత్ కనెక్షన్లు, మీటర్ల నంబర్లు, తదితర వివరాలను సేకరించే పనిని జిల్లా విద్యాశాఖ దాదాపు పూర్తిచేసింది. జిల్లాలో మొత్తం 2,233 పాఠశాలలు న్నాయి. వీటిలో 1,744 ప్రభుత్వ, 20 ఎయిడెడ్, 469 ప్రైవేటు అన్‌ఎయి డెడ్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. సుమారు 70శాతం పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, స్మార్ట్ టీవీలు, కొన్నింటిలో తాగునీటి శుద్ధిప్లాంట్లు, తదితర ఉపకరణాలన్నీ విద్యుత్‌పై పనిచేసేవే ఉన్నాయి. వీటి విని యోగానికి నెలనెలా సగటున వందలు, వేల రూపాయ ల్లోనే విద్యుత్ బిల్లులు వస్తుంటాయి. ఆయా ప్రభుత్వ పాఠ శాలలకు ఇప్పుడున్న విద్యుత్ సర్వీసు, మీటరు నంబర్లను సీఎఫ్‌ఎంఎస్‌లో ఆన్‌లైన్ విధానంలో నమోదు చేస్తే, సంబం ధిత మండల విద్యాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 190 ప్రభుత్వ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలల హెచ్‌ఎంలంతా ఉచిత విద్యుత్‌కు వివరాలను నమోదు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కొన్ని పాఠశాలల విద్యుత్ సర్వీసులు, మీటర్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌సంస్థలకు అనుసంధానం కావడం తో ఏపీలో నమోదుకు అడ్డంకిగా ఉందని గుర్తించారు. ఇక ఏలూరు నగరపాలక సంస్థలో కొన్ని పాఠశాలల విద్యుత్ కనెక్షన్లు చాలాఏళ్ల క్రితంనాటివి కావడం, పూర్వపు సర్వీసు నంబర్లకు కొంతకాలం క్రితం నుంచి కొన్ని అంకెలు జోడ వడంతో సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు కావడం లేదని తేల్చారు. ఏపీఈపీడీసీఎల్ జిల్లా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి కొద్దిరోజుల క్రితమే పరిష్కరించారు. తెలంగాణ విద్యుత్ మీటర్లు, సర్వీసుల సమస్య పెండింగ్‌లోనే ఉంది.
హెచ్‌ఎంలపై తప్పిన భారం
ఇప్పటివరకు అమల్లోవున్న విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ గ్రాంటురూపంలో నిధులను ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని విద్యాశాఖ విడుదల చేసేది. ఈ నిధుల నుంచే చాక్‌పీసులు, స్టేషనరీ, మైనర్ రిపేర్లు, విద్యుత్ బిల్లుల చెల్లిం పు, తదితర ఖర్చులకు వెచ్చించేవారు. ప్రభుత్వ గ్రాంటుకు, పాఠశాలలో విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మధ్య భారీ వ్యత్యాసమే ఉండేది. ఈ అదనపుభారాన్ని హెచ్‌ఎంలే మోసేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్కూల్ మెయింటె నెన్స్ గ్రాంటు నిధులు సకాలంలో విడుదల కాక ప్రధానో పాధ్యాయులు సొంత నిధులను ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రభుత్వ పాఠశాలలైనా ఎటువంటి రాయితీలు లేకుండా విద్యుత్ చార్జీలు విధిస్తుండటంతో పలు సందర్భాల్లో ప్రధానో పాధ్యాయులు విద్యుత్ బిల్లులు, బకాయిలు, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం వద్ద అభ్యర్థించినా పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపు అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలపై వి ద్యుత్ బిల్లుల భారం పడకుండా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలకున్న విద్యుత్ సర్వీసుల వివరాల సేక రణను దాదాపు పూర్తిచేశారు. ఈ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను కొన్ని పరిమితులతో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ తుది నిర్ణయం, మార్గదర్శకాల్లో స్పష్టత రానుంది. మొత్తంమీద ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ బిల్లులభారం లేకుండా తీసుకుం టున్న చర్యలపై ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.