16 కాదు.. 27 గంటలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:59 AM
నరసాపురం నుంచి మైసూర్‌కు కొత్తగా రైలు వేయడంతో ప్రయాణికులు సంబరపడ్డారు. ఉదయం సికింద్రాబాద్ కు, బెంగళూరుకు వెళ్లేందుకు సౌలభ్యం గా ఉంటుందని అంతా ఆనందపడ్డారు. ఈ సంతోషం మూడునాళ్ల ముచ్చటగా మారింది.
నరసాపురం నుంచి పండుగ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు తీరిది
తెలియక టిక్కెట్లు తీసుకుని ప్రయాణికుల లబోదిబో
చుట్టు తిరిగి వెళ్లడంతో అధిక సమయం
నరసాపురం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి):నరసాపురం నుంచి మైసూర్‌కు కొత్తగా రైలు వేయడంతో ప్రయాణికులు సంబరపడ్డారు. ఉదయం సికింద్రాబాద్ కు, బెంగళూరుకు వెళ్లేందుకు సౌలభ్యం గా ఉంటుందని అంతా ఆనందపడ్డారు. ఈ సంతోషం మూడునాళ్ల ముచ్చటగా మారింది. కారణం ఈ రైలు చుట్టు తిరి గి వెళ్లడమే. తెలియక రిజర్వేషన్ చేయిం చుకున్న బెంగళూరు, మైసూర్ వెళుతు న్న ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నా రు. నరసాపురం నుంచి బెంగళూరుకు వారంలో రెండు రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి శుక్రవారం కాట్పాడి మీదుగా ఈ రైలు నడుస్తుంది. నరసాపురం నుంచి బెంగళూరుకు 16 గంటల ప్రయాణం. ఇది కాకుండా భీమవరం నుంచి శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇది 15 గంటల్లో బెంగ ళూరు చేరుతుంది. వీటితోపాటు ఇటీవల కొత్తగా నరసాపురం నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లో బెంగళూరు మీదుగా మైసూర్‌కు 07033 నెంబర్‌తో పండుగ స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఈ రైలు గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, వికారాబాద్, తాండూరు, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్, అనంతపురం, ధర్మవరం మీదుగా బెంగళూరు, అక్కడి నుంచి మైసూర్ వెళుతుంది. ఈ రైలు నరసాపురంలో ఉదయం 11.35కి బయ లుదేరి మరుసటి రోజు ఒంటి గంటకు బెంగళూరు చేరుతుంది. చుట్టు తిరిగి వెళ్లడం వల్ల దాదాపు 24 గంటల సమ యం పడుతుంది. అక్కడి నుంచి మైసూ ర్‌కు మరో మూడు గంటలు సమయం. అంటే దాదాపు ఈ రైలులో మైసూర్ వెళ్లాలంటే దాదాపు 27 గంటల సమ యం పడుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది టిక్కెట్లు బుక్ చేసుకుని లబోదిబోమంటున్నారు. ఈ రైలు జిల్లా వాసులకు ఉదయం సికింద్రాబాద్ వెళ్లేం దుకు మాత్రమే ఉపయోగం తప్ప బెంగ ళూరుకు పెద్దగా సౌలభ్యం లేదని పెదవి విరుస్తున్నారు.