Share News

నాన్‌ లే అవుట్లపై కొరడా

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:21 AM

గ్రామాల్లో అనధికార లే అవుట్లపై పంచాయతీరాజ్‌ శాఖ కొరఢా ఝుళిపించ నుంది. అత్యధికంగా పట్టణాలను ఆనుకుని వున్న పంచాయతీల్లో ఇవి ఇబ్బడి ముబ్బడిగా వెలిసినట్లు గుర్తించింది. జిల్లా ప్రధాన రహదారులకు ఆనుకుని వున్న మేజర్‌ పంచాయతీల్లోని వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు అనధికారిక లే అవుట్‌లుగా మార్చే స్తున్నారు

నాన్‌ లే అవుట్లపై కొరడా

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,500 వరకు గుర్తింపు

క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు

ఏడు రోజుల ముందే నోటీసులు

స్పందించకపోతే స్థలాల్లో పంచాయతీ బోర్డులు

భీమవరం రూరల్‌, నవంబరు 13(ఆంధ్ర జ్యోతి):గ్రామాల్లో అనధికార లే అవుట్లపై పంచాయతీరాజ్‌ శాఖ కొరఢా ఝుళిపించ నుంది. అత్యధికంగా పట్టణాలను ఆనుకుని వున్న పంచాయతీల్లో ఇవి ఇబ్బడి ముబ్బడిగా వెలిసినట్లు గుర్తించింది. జిల్లా ప్రధాన రహదారులకు ఆనుకుని వున్న మేజర్‌ పంచాయతీల్లోని వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు అనధికారిక లే అవుట్‌లుగా మార్చే స్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతి లేకుండా నివాస స్థలాలుగా విడదీసి విక్రయి స్తున్నారు. ఈ ఖాళీ స్థలాలపై పంచాయ తీలు ఎలాంటి పన్నులు వేసే అధికారం లేకపోవడంతో ఆదాయం కోల్పోతున్నాయి. అదే పట్టణాల్లోని ఖాళీ స్థలాలకు పన్ను ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,500 వరకు నాన్‌ లే అవుట్లు ఏర్పడ్డాయి. వీటిపై జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ దృష్టి సారించింది.

పన్నులు వేసేలా..

పంచాయతీల ఆదాయం పెంచుకునేందు కు, స్థలాల కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా వారి లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్‌లకు దిశా నిర్దేశం చేశారు. మండలాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నాన్‌ లే అవుట్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. క్రమబద్ధీకరించుకోని పక్షంలో లే అవుట్లలో వేసిన రహదారులను ధ్వంసం చేయనున్నా రు. స్థలాల మధ్య పాతిన సరిహద్దు రాళ్లను తొలగించనున్నారు. తొలుత గుర్తించిన అన ధికార లేవుట్లలో స్థల యజమానులకు వారం రోజుల ముందు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికి స్పందించకపోతే మరో వారం గడువు ఇస్తారు. స్పందించని యజమానులపై కేసులు నమోదు చేయడానికి వెను కాడరు. క్రమబద్ధీకరించుకుంటే కలిగే ప్ర యోజనాలను యజమానులకు ముందుగా అవగాహన కల్పిస్తారు. లే అవుట్‌ గుర్తింపు ఉంటే ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు మంజూరుచేస్తాయి. పంచాయతీలు మౌలిక వసతులు కల్పిస్తాయి.

50 శాతం రాయితీ

నాన్‌ లే అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. నిబంధనల ప్రకారం 14 శాతం చెల్లించాలి. ఇప్పుడు ఇది ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుం ది. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. దీంతో నాన్‌ అవుట్లు లే అవుట్లుగా మార్చే అవకాశం స్థలదారులకు సులభదాయకమవుతుంది.

Updated Date - Nov 14 , 2025 | 12:21 AM