Share News

నో వాకింగ్‌..!

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:21 AM

పట్టణ ప్రజల సౌకర్యార్థం చెరువుగట్టుపై మునిసిపల్‌ అధికారులు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు.

నో వాకింగ్‌..!
చెరువు గట్టుపై వాకింగ్‌ ట్రాక్‌ గేటుకు తాళం

చింతలపూడి, జూలై 15(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల సౌకర్యార్థం చెరువుగట్టుపై మునిసిపల్‌ అధికారులు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. ఉద యాన్నే వాకింగ్‌కు వెళ్లినవారు వెనుదిరగాల్సిందే. వాకింగ్‌ ట్రాక్‌కు అధికా రులు తాళాలు వేసేశారు. అమృత్‌ 2.0 పథకంలో మునిసిపాలిటీ సుందరీ కరణ పేరుతో వేగిలింగేశ్వరస్వామి చెరువుగట్టు చదునుచేసి గేటు ఏర్పాటు చేశారు. దాతలు బెంచీలు, లైట్లు సమకూర్చారు. ‘ఐ లవ్‌ చింతలపూడి’ అంటూ లైటింగ్‌ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ వాకింగ్‌ ట్రాక్‌ మాత్రం పట్టణ ప్రజలకు అందుబాటులో లేదు. రూ.78 లక్షలతో సుందరీకరణ చేపట్టిన చెరువు గట్టుకు ప్రజలు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాళాలు ఎందుకు వేశారని అధికారు లను అడిగితే పశువులు మొక్కలు తినేస్తున్నాయని, తేళ్లు, పాములు వాకింగ్‌ ట్రాక్‌పైకి వస్తున్నాయని చెబుతున్నారు. వాకింగ్‌ ట్రాక్‌.. సుందరీ కరణ.. ఐ లవ్‌ చింతలపూడి ఎందుకని పట్టణ ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:21 AM