Share News

ఆకివీడు.. అంధకారం

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:33 AM

ఆకివీడు పట్టణం అంధకారంలో చిక్కుకుంది. కనీసం వీధి దీపాలను కూడా వెలిగించలేకపోతున్నారంటే నగర పంచా యతీ నిర్వహణ తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆకివీడు.. అంధకారం
ఆకివీడు జాతీయ రహదారిపై వెలగని వీధిలైట్లు

వెలగని వీధి దీపాలు.. తొలగని చీకట్లు

ఆరు దాటితే భయం.. భయం

ప్రమాదాలతో ప్రజలు ఆసుపత్రుల పాలు

ఆకివీడు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆకివీడు పట్టణం అంధకారంలో చిక్కుకుంది. కనీసం వీధి దీపాలను కూడా వెలిగించలేకపోతున్నారంటే నగర పంచా యతీ నిర్వహణ తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలోని ఓ పట్టణంలో ఈ పరిస్థితి ఏర్ప డడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రంగంలోకి దిగితే తప్ప ఈ చీకట్లు తొలగవని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. మునిసిపల్‌ అధికా రులు ప్రజా ప్రతినిధుల మాట వినకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. పట్టణంలోని ఇరవై వార్డుల పరిధిలో 1,700 వీధి దీపాలు వున్నాయి. గడిచిన మూడు నెలలుగా వీటిలో సగం వెలిగితే ఒట్టు. సాయంత్రం ఆరు దాటితే పట్టణమంతా అంధకారం అలుమకొంటుంది. వార్డు కౌన్సిలర్లు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వీధుల్లో స్తంభాలున్నా బల్బులు వేయరు. చీకటిపడే వేళ.. ప్రభుత్వ ఉద్యోగులు, కళాశాలలు, పాఠశాలల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. చీకట్లలో వెళుతున్న జనం కనిపించక కుక్కలు, పశువులపైకి వెళుతుండడంతో అవి తిరగబడి గాయపరుస్తున్నాయి. ఇక చోరీలు, ఆకతాయిల వేధింపులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇవి కాక రోడ్డు ప్రమాదాలు సరేసరి. పన్నుల రూపంలో ప్రజల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా కనీస అవసరాలు తీర్చడం లేదు. ప్రతీ నెలా కౌన్సిలర్లు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు.

Updated Date - Dec 27 , 2025 | 12:33 AM