Share News

ఏదీ స్పందన

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:02 AM

ఆక్వా రంగంలో రిజిస్ర్టేషన్‌ చేసు కున్న చెరువులకే విద్యుత్‌ రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు లభించనున్నాయి. విద్యుత్‌ విషయంలో ఇప్పటికే మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఏదీ స్పందన

1.33 లక్షల ఎకరాలకు రిజిస్ర్టేషన్‌ అయింది 50 వేలే

నాన్‌ ఆక్వా జోన్‌లో 13 వేల ఎకరాలు

పూర్తయిన సర్వే.. ప్రభుత్వానికి నివేదిక

ప్రతి ఎకరానికి రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

త్వరలోనే రైతులకు నోటీసులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆక్వా రంగంలో రిజిస్ర్టేషన్‌ చేసు కున్న చెరువులకే విద్యుత్‌ రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు లభించనున్నాయి. విద్యుత్‌ విషయంలో ఇప్పటికే మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిజిస్ర్టేష న్‌ తప్పనిసరి చేసింది. పది ఎకరాల లోపు చిన్న, సన్న కారు ఆక్వా రైతులకు మాత్రమే యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలోనూ ఇదే విధానాన్ని అమ లుచేశారు. అప్పట్లో నాన్‌ ఆక్వా జోన్‌లో వున్న చెరువులకు రాయితీ ఇవ్వలేదు. తాజాగా నాన్‌ ఆక్వా జోన్‌పైనా ప్రభు త్వం సానుకూల నిర్ణయం తీసుకోనుం ది. జిల్లాలో చెరువులు, విస్తీర్ణంపై ఇటీ వల సమగ్ర సర్వే చేశారు. సచివాల యాల్లోని ఫిషరీస్‌ అసిస్టెంట్‌లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మత్స్య శాఖ కమిషనర్‌కు జిల్లా అధికారులు నివేది కను సమర్పించారు. ప్రభుత్వ ఆమోదంతో త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. తదనుగుణంగా రిజిస్ర్టేషన్‌ల కోసం రైతులకు నోటీసులు జారీ చేయనున్నారు.

50 శాతంలోపే రిజిస్ర్టేషన్‌

పశ్చిమలో 50 శాతంలోపే చెరువులకు రిజిస్ర్టేషన్‌లు చేశారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు విస్తరిం చి వుంటే 42,051 ఎకరాల్లో మాత్రమే రైతులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. మరో వైపు మొత్తం విస్తీర్ణంలో 13 వేల ఎక రాలు నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్నాయి. వాటిని ఆక్వా జోన్‌ పరిధిలోకి తీసుకు రానున్నాయి. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న చెరువులకు మాత్రమే విద్యుత్‌ రాయితీ వర్తింపజేయనున్నారు. అందరికీ విద్యుత్‌ రాయితీ వర్తించాలంటే జిల్లాలో 91 వేల ఎకరాల్లో చెరువులను రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. రైతులకు రిజిస్ర్టేషన్‌ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన సీడ్‌ ఇవ్వకపోతే సదరు హాచరీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా రాయితీలు వర్తించనున్నాయి. ఆక్వా సాగు పెంచడానికి కేంద్రం అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. పెద్ద రైతులు మాత్రమే ఇప్పటి వరకు లబ్ధి పొందుతూ వచ్చారు. ఇకపై రిజిస్ర్టేషన్‌ చేసుకున్న రైతులందరికీ ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ప్రధానంగా రిజిస్ర్టేషన్‌ జాబితాలో నమోదు కాని చెరువులకు విద్యుత్‌ రాయితీ అమలు కాదు. త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తారు నోటీసులు జారీచేస్తారు.

Updated Date - Jun 06 , 2025 | 01:02 AM