చినుకుల సవ్వడేది ?
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:28 AM
నైరుతి రుతు పవనాలు మందగించి వాన లు లేకపోవడం.. వేసవితో పోటీ పడేలా ఎండ లుకాయడంతో అటు రైతులు.. ఇటు ప్రజలు అల్లాడిపోతున్నారు.
జూలైలో లోటు వర్షపాతం
ఆషాఢంలోనూ వేసవి ఎండలు
నీరు లేక.. నారు వేయలేక రైతులు..
ఉక్కపోతతో జనం బెంబేలు
(తణుకు రూరల్/పాలకొల్లు అర్బన్/భీమవరం టౌన్–ఆంధ్రజ్యోతి):
నైరుతి రుతు పవనాలు మందగించి వాన లు లేకపోవడం.. వేసవితో పోటీ పడేలా ఎండ లుకాయడంతో అటు రైతులు.. ఇటు ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలో ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుం డగా మన రాష్ట్రంలో మాత్రం రుతు పనవ నాలు ముఖం చాటేయడంతో భారీ వర్షపాతం లోటు ఏర్పడింది. వరి నాట్లు వేసేందుకు దాళ్వా సీజన్ మాదిరి కాలువల నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లాలో సాధార ణంగా జూలై మాసంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది. గడిచిన ఐదేళ్ల గణాంకాలు ఇదే సూచిస్తున్నాయి. కాని, ఈ ఏడాది ఈ నెల 14 రోజులపాటు కురిసిన వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువ వుంది. ఈ నెల సాధా రణ వర్షపాతం 170 ఎంఎం, 14 రోజులకు 96 ఎం.ఎం వర్షపాతం కురవాలి. కురిసింది మాత్రం 25.5 ఎం.ఎం. ఫలితంగా మెరక పొలాల్లో వరి నాట్లు వేసేందుకు అవసరమైన సాగు నీరందక రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మేలో కురిసిన భారీ వర్షాల కారణంగా చేలలో నిలిచిన నీటితోనే నారుమడులు తయారు చేసుకున్న రైతులకు అనంతరం వరి నాట్ల సమయంలో కొన్ని ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు పడుతున్నా రు. సాగు నీరందకపోవడంతో మెరక పొలాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజు లుగా తణుకు రూరల్ మండలం దువ్వ, తేతలి, మండపాక శివార్లలోని మెరక పొలాల కు నీరందలేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కాలువలకు నీటి సరఫరాను పెంచి సమస్యను పరిష్కరించారు.
అధిక ఎండ, ఉక్కపోత
ఆషాడ పౌర్ణమి దాటిపోయినా వరుణుడు కరుణించడం లేదు. వేసవి కాలం మాదిరి ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మంగళ వారం భానుడు తన ప్రతాపాన్ని చూపించా రు. పాలకొల్లులో 38 డిగ్రీలకన్నా అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంట ల నుంచి వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి ఇబ్బందులుపడ్డారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. వేడిగాలులు వీయడంతో రోడ్ల మీద తిరిగే ప్రజలకు ఇబ్బందిపడ్డారు. భీమవరంలో గడిచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదుతోంది. ఉద యం ఆరు గంటల నుంచే ఉక్కబోతగా ఉంటున్నది. బాటసారులు శీతల పానీయాల కోసం ఎగబడ్డారు. చిన్నారులు, వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. వర్షాలు కురిసి వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా ? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.