విమానాశ్రయం భూములకు రక్షణ ఏదీ ?
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:23 AM
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ భూములకు రక్షణ కొరవడుతోంది. కోర్టులో కేసులున్నాయంటూ అధికారులు మీన మేషాలు లెక్కిస్తు న్నారు.
కమ్ముకొస్తున్న ఆక్రమణదారులు
ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు
పట్టించుకోని మున్సిపాలిటీ
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న
పట్టణ ప్రణాళికా విభాగం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ భూములకు రక్షణ కొరవడుతోంది. కోర్టులో కేసులున్నాయంటూ అధికారులు మీన మేషాలు లెక్కిస్తు న్నారు. ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు గతంలో తమ భూమి అంటూ రెవెన్యూ, మున్సిపాలి టీలు సర్వేలు చేసి తమ అధీనంలో ఉంచు కున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా విడచి పెడుతున్నాయి. లేఅవుట్‌లు వేసుకునేలా మున్సిపాలిటీ అధికారులు ప్రోత్సాహం అందిస్తున్నారు. తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్–గణేష్ నగర్ రహదారికి ఆనుకుని ఉన్న 8.18 ఎకరాల భూమిని అధికారులు పట్టించుకోవడం లేదు. గత తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అప్పటి మంత్రి మాణిక్యాలరావు అదే భూమిలో కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని తలపెట్టారు. హైకోర్టు సైతం భూమిని స్వాధీనం చేసుకుని రక్షించుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించింది. అప్పటి నుంచి అక్కడ అభివృద్ధి పనులకు ప్రయత్నాలు జరిగాయి. గతంలో మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు అదే స్థలంలో పర్యాటక శాఖ నిధులతో అభివృద్ధి చేయాలని తలచారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. అప్పట్లో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. తదుపరి కన్వెన్షన్ సెంటర్ మరుగన పడిపోయింది. ఇప్పుడదే స్థలం ఎవరిది అంటే అధికారులు సైతం తెలిసీ తెలయనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు నుంచి క్రమేపీ భూమి ఆక్రమణకు గురవు తోంది. ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై అధికారులు సైతం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పట్టణానికి అవే భూములు
తాడేపల్లిగూడెం అభివృద్ధిలో విమానాశ్రయ భూములే కీలకంగా ఉంటున్నాయి. ఏపీ నిట్‌కు 172 ఎకరాలు కేటాయించారు. నన్నయ క్యాంపస్‌ను 18 ఎకరాల్లో నిర్మించారు. ఏపీ టిడ్కో ఇళ్లను 54 ఎకరాల్లో నిర్మించారు. వైసీపీ హయాంలో పట్టణ ప్రజలకు సెంటు స్థలం వంతున విమానాశ్రయ భూములనే కేటాయిం చారు. అక్కడ లేని కేసులు ఇప్పుడు 8.18 ఎకరాల విషయంలో అధికారులు నాన్చివేత ధోరణిలో ఉన్నారు.కేసులుంటే పరిష్కారానికి కృషి చేయాలి. విమానాశ్రయ భూముల విషయంలో అది కూడా కనిపిస్తున్నట్టు లేదు. గణేష్ నగర్ నుంచి శశి ఇంజనీరింగ్ కళాశాల రహదారిలో మాత్రం భూమి తమదంటూ జబ్బలు చరుచు కుంటున్నారు.అక్కడ ప్రైవేటు భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే విమా నాశ్రయ భూముల్లో రహదారికి నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రెవెన్యూ వెనుకంజ వేస్తోంది. కానీ రెవెన్యూ, మున్సిపాలిటీ పరిధిలో ఉండే భూముల విషయంలో మాత్రం పెద్దగా పట్టిం చుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు భూములు అందుబాటులో లేవన్న రీతిలోనే అధికారులు వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న భూముల్లో నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ, మున్సిపాలిటీపై ఉంది. ఈ విషయంలో అధికా రులు కూటమి నేతల పేరు వాడుకుంటు న్నారు.పూర్తిగా అక్రమ నిర్మాణాలను గాలి కొది లేస్తున్నారు. విమానాశ్రయ భూముల విషయం లోనూ అధికారుల తీరు అలాగే ఉంది. పట్టణం అభివృద్ధి చెందాలంటే వాటిని పరి రక్షించు కోవాలి. లేదంటే ఉన్న భూములకు కూడా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
విమానాశ్రయ భూములన్నింటికీ వర్తించదా ?
వాస్తవానికి సుప్రీం కోర్టుల్లో ఎంతోమంది కేసులు వేశారు. బ్రిటిష్ కాలంలో విమానాశ్రయం కోసం ఇచ్చిన రైతులు అందుకు వినియోగించకపోతే తమ భూములు ఇచ్చే యాలంటూ ఒప్పందం మేరకు ప్రభుత్వానికి భూములు అప్పగించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో భూములు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సొమ్ములు చెల్లించి రాష్ట్ర పరిధిలోకి తెచ్చుకుంది. రెవెన్యూ శాఖ రక్షణగా ఉంటోంది. అయినా సరే ఆక్రమణలు జరిగిపోయాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆక్రమణల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. ఎప్పటినుంచో నిర్మాణాలు ఉన్న వాటిని ఆక్రమణదారులు అభివృద్ధి చేసుకుంటున్నారు. వాటి విషయంలో ఎవరి నుంచి అభ్యంతరాలు ఉండడం లేదు. కానీ రెవెన్యూ ఆధీనంలో ఉన్న భూమి విషయంలో ఉదాసీనతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.