Share News

రుణాలు..తూచ్‌!

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:37 AM

వైసీపీ హయాంలో స్వయం ఉపా ధి రుణాలు అందక ఎస్సీ యువత నిర్వీ ర్యం అయ్యింది. గతసారి టీడీపీ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్‌ కులాలకు స్వయం ఉపాధి రుణాలు అందించి ఆర్థికంగా ఎద గడానికి తోడ్పడింది.

రుణాలు..తూచ్‌!

స్వయం ఉపాధి ఊసేలేదు

టీడీపీ ప్రభుత్వం రాకతో భరోసా

ఉపాధి యూనిట్ల స్థాపనకు నోటిఫికేషన్‌

వెల్లువెత్తిన దరఖాస్తులు

ఏలూరుటూటౌన్‌, జూలై 30(ఆంధ్ర జ్యోతి): వైసీపీ హయాంలో స్వయం ఉపా ధి రుణాలు అందక ఎస్సీ యువత నిర్వీ ర్యం అయ్యింది. గతసారి టీడీపీ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్‌ కులాలకు స్వయం ఉపాధి రుణాలు అందించి ఆర్థికంగా ఎద గడానికి తోడ్పడింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో స్వయం ఉపాధి రుణాలను విస్మరించింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మరల షెడ్యూల్‌ కులాలకు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకో వడానికి ద్వారాలు తెరిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,853 యూనిట్ల స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో ఏలూరు జిల్లాకు 1,111 పశ్చిమగోదావరి జిల్లాకు 742 యూనిట్లు స్థాపించేందుకు ప్రభు త్వం నిర్ణయించింది. ఏలూరు జిల్లాకు 6,833, పశ్చిమగోదావరి జిల్లాకు 3,181 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాకు 46.44 కోట్ల రూపాయల యూనిట్లు స్థాప నకు కేటాయించారు. వీటిలో ప్రభుత్వ సబ్సిడీ రూ.18.35కోట్లు, బ్యాంకు రుణాలు రూ.25.77 కోట్లు లబ్ధిదారుని వాటాగా రూ.2.3 కోట్లు ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు 742 యూని ట్లకు రూ.3.9 కోట్లు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.12.22 కోట్లు సబ్సిడీ కాగా బ్యాంకు రుణాలు రూ.17.13 కోట్లు లబ్ధిదారుడి వాటాగా రూ.1.55 కోట్లుగా నిర్ణయించారు. ఇంకా ఇంటర్వ్యూలు జరుగుతాయనే సమ యానికి ప్రభుత్వం రుణాలప్రక్రియ నిలు పుదల చేసింది. త్వరలో మళ్లీ ఇంటర్వ్వూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఏఏ యూనిట్లకు రుణాలిస్తారు..

మూడు లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ, బ్యాంకు రుణాలు 35 శాతం, లబ్ధిదారుడి వాటా 5 శాతం. ఈ కేటగిరిలో ఫ్లవర్‌బొకేల తయారీ, వర్మీకం పోస్టు యూనిట్‌, కంప్యూటర్‌ వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌, ఎల్‌ఈడీ బల్బుల తయా రీ, వాటర్‌బాటిల్స్‌ రీసైక్లింగ్‌, ప్లంబింగ్‌, ఎలక్ర్టీషియన్‌ సర్వీస్‌ యూనిట్లు స్థాపిం చుకోవచ్చు. రూ.మూడు లక్షలకు పైగా యూనిట్లు స్థాపించుకునేవారికి 40 శాతం సబ్సిడీ, 55 శాతం బ్యాంకు రుణం, లబ్ధిదా రుడి వాటా 5శాతం. ఈ విభాగంలో మొబైల్‌ రిపేరింగ్‌, సోపుల తయారీ, ఫిష్‌ ఫార్మింగ్‌, కార్‌వాష్‌ సర్వీస్‌ సెంటర్‌, బేకరీ షాపు తదితర 26 రకాల యూనిట్లు స్థాపించుకోవచ్చు. రూ.10 లక్షలకు పైగా యూనిట్లు స్థాపించుకునేవారికి 40 శాతం సబ్సిడీ, బ్యాంకు రుణాలు 55 శాతం, లబ్ధిదారుడి వాటా 5శాతం. ఈ విభాగంలో ఈవీ బ్యాటరీ చార్జీంగ్‌ యూనిట్లు స్థాపించుకోవచ్చు. పాసింజర్‌ ఆటోలు, పాసింజర్‌ కార్లు, గూడ్స్‌ ట్రక్కులు, వ్యవసాయ విభాగంలో డ్రోన్లు అందిస్తారు. మొత్తం రూ.10లక్షలు రుణాలుగా అందిస్తారు.

మెరుగులు దిద్దేందుకే నిలుపుదల

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు త్వరలోనే అందిస్తాం. ఉన్న పథఽకానికి ఇంకా మెరుగులు దిద్దేందుకే ప్రభుత్వం తాత్కాలికంగా ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. కొత్తతరం యూనిట్లు స్థాపించు కోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇంకా రుణసదుపాయం పెంచడానికి కొత్తయూనిట్ల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

Updated Date - Jul 31 , 2025 | 12:37 AM