విద్యార్థులకు కొత్త పుస్తకాలు సిద్ధం
ABN , Publish Date - May 31 , 2025 | 12:28 AM
పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు జిల్లా పుస్తక విక్రయ కేంద్రం నుంచి మండలాలకు చేరుకున్నాయి.
మండల కేంద్రాలకు చేరవేత
పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ
తాడేపల్లిగూడెం రూరల్, మే30 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు జిల్లా పుస్తక విక్రయ కేంద్రం నుంచి మండలాలకు చేరుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12,44,864 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా పది రోజుల క్రితమే జిల్లా పుస్తక విక్రయ కేంద్రం నుంచి ఆయా మండల కేంద్రాలకు తరలించారు.
బ్యాగ్ బరువు తగ్గించేలా..
ప్రస్తుతం సెమిస్టర్ పద్ధతిలో సిలబస్ విభ జించి పుస్తకాలు రెండు దపాలుగా అందించే ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులకు పుస్త కాల బరువు తగ్గనుంది. పాత సిలబస్ మార్పు చేయకుండా కొత్త పుస్తకాలు రూపొం దించారు. గతంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, బెల్ట్‌లపై జగన్ ఫోటోలు ముద్రించడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. కూటమి సర్కారు ఫోటోలకు ప్రాధాన్యం ఇవ్వకుండా బ్యాగ్‌లు, బెల్ట్‌లు, పుస్తకాలు సిద్ధం చేశారు. 53 టైటిల్స్ తగ్గించేవిధంగా పుస్తకాల్లో మార్పు చేశారు. 1 నుంచి 7వ తర గతి వరకూ గతంలో 223 టైటిల్స్ ఉండగా ప్రస్తుతం 170కి కుదించారు. వాటిని కూడా రెండు సెమిస్టర్లుగా విభజించారు.
కిట్‌లో బెల్ట్‌లు మాత్రమే..
విద్యార్థులకు అందించే స్కూల్ కిట్‌లో నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, షూ ఇంకా రాలేదు. ప్రస్తుతం బెల్ట్‌లు మాత్రమే వచ్చాయి. వారం రోజుల్లో బ్యాగ్‌లు, షూ, నోట్ పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 93450 మంది విద్యా ర్థులు ఉండగా 1 నుంచి 5 వ తరగతి వరకు బాలికలకు మాత్రమే బెల్ట్‌లు అందిస్తారు. ఆ బెల్ట్‌పై సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని ముద్రించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యారంగానికి చేసిన సేవలను గుర్తింపుగా లోగో వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు తోంది. వాటితోపాటు నోట్ పుస్తకాలపై కూడా రాష్ట్రం అధికారిక ముద్ర మినహా మరే ఫోటోలకు తావివ్వలేదు. మొత్తం విద్యార్థి కిట్ అంతా సర్వేపల్లి రాఽధాకృష్ణ విద్యార్థి మిత్ర అని ఉండటం గమర్ణహం.
యూనిఫాం అందలేదు..
జిల్లాలో 93,450 మంది విద్యార్థులకు యూ నిఫాం ఇంకా జిల్లా కేంద్రాలకు చేరలేదు. క్లాత్ మండల కేంద్రాలకు చేరితే కుట్టించేందుకు మరింత సమయం పడుతుంది. క్లాత్ చేరుకో కపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.