Share News

18 బార్‌లకు కొత్త లైసెన్స్‌లు

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:01 AM

జిల్లాలోని 18 బార్‌లకు నాలుగేసికంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో కలెక్టర్‌ నాగరాణి లాటరీ ద్వారా డ్రా తీసి లైసెన్స్‌ లు కేటాయించారు.

18 బార్‌లకు కొత్త లైసెన్స్‌లు

లాటరీ ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్‌

భీమవరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 18 బార్‌లకు నాలుగేసికంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో కలెక్టర్‌ నాగరాణి లాటరీ ద్వారా డ్రా తీసి లైసెన్స్‌ లు కేటాయించారు. మొత్తం 31 బార్‌లు ఉండగా ఓపెన్‌ కేటగిరీలో 28, మూడు గీత కులాల వారికి కేటాయించారు. ఓపెన్‌ కేటగిరీలో దరఖాస్తులు 15కి మాత్రమే నాలుగుకంటే ఎక్కువ అందాయి. వాటికి మాత్రమే లాటరీ నిర్వహించారు. మిగిలిన 13 బార్‌లకు కేటాయించలేదు. ఓపెన్‌ కేట గిరీలో.. భీమవరం మూడు బార్లకు పుల గం వెంకట సత్యనారాయణ, వెంకట శివుడు, బండారు వినోద్‌కు, నర సాపు రంలో మారం శ్రీనివాసరావు, పాలకొల్లులో రుద్రరాజు సత్యనారాయణరాజు, మేకా లక్ష్మి నాగసందీప్‌, బోనం సూర్యప్రకాష్‌, అంగర లక్ష్మీ పుష్పలత, సింగలూరు రమేశ్‌, తాడేప ల్లిగూడెంలో ఆలపాటి వీర వెంకటనాగభూ షణం, తణుకులో పువ్వల శ్రీరాం ప్రసాద్‌, అరవ సంపత్‌, రెడ్డి వీరవెంకటరత్నం, రామాయణం జగదీశ్వరరావు బార్‌లను దక్కించుకున్నారు. భీమవరం, తాడేపల్లిగూ డెం, పాలకొల్లు పట్టణాల్లోని గీత కులాలకు కేటాయించిన మూడు బార్‌లను గుత్తుల సత్యనారాయణ, మేకా కోటేశ్వరసిద్ధాంతి, గుబ్బల వనజలకు బార్‌లు వరించాయి. భీమవరం 4, తాడేపల్లిగూడెం 4, తణుకు 3, నర్సాపురం 2 బార్లకు ఒక్క దరఖాస్తు రాలేదు. పాలకొల్లులో రెండు బార్లు బోనం సూర్యప్రకాశ్‌కు దక్కాయి.

Updated Date - Aug 31 , 2025 | 01:01 AM