మార్పు కోసం..!
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:38 AM
రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల నేది ప్రభుత్వం లక్ష్యం. దీనికను గుణంగా ఏలూరు జిల్లాపై అధికార యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించింది.
సారా రహిత జిల్లా లక్ష్యంగా అడుగులు.. తయారీ, విక్రయదారులకు ఉపాధి అవకాశాలు
నేడు 57 గ్రామాలకు జంగారెడ్డిగూడెంలో రుణమేళా
జంగారెడ్డిగూడెం రూరల్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల నేది ప్రభుత్వం లక్ష్యం. దీనికను గుణంగా ఏలూరు జిల్లాపై అధికార యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించింది. సారా తయారీ, విక్రయదారుల కుటుంబ పోషణ, ఉపాధి కోసం అండగా నిలవనుంది. నవోదయం–2.0లో భాగంగా ‘మార్పు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిని అమలు చేయడం ద్వారా వారిలో మార్పు తేవాలని ప్రభుత్వ, అధికార యంత్రాంగం భావిస్తున్నారు. కేసులు పెట్టి జైళ్లకు పంపడం కన్నా వారిలో మార్పు తీసు కొచ్చి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
నేడు ప్రత్యేక శిబిరం
జంగారెడ్డిగూడెం, పోలవరం ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కార్యాలయ పరిధిలోని సారా రహిత గ్రామాలుగా గుర్తించిన సుమారు 57 గ్రామాలకు చెందిన వారిని గుర్తించి వారికి జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం రుణ మేళాకు సంబంధించి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సారా తయారీ, విక్రయాల ద్వారా కుటుంబ పోషణ జరుపుకున్న వారికి తమ కుటుంబాల పోషణ కు వివిధ చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకు నేందుకు సుమారు రూ.2లక్ష ల వరకు రుణం ఇవ్వనున్నా రు. గతంలో నవోదయం మొదటి విడత కార్యక్రమంలో సారా రహిత గ్రామాలను ఏర్పర్చడంలో మంచి ఫలితా లు వచ్చాయి. ప్రస్తుతం నవోదయం 2.0లో భాగంగా మార్పు కార్యక్రమం ద్వారా మరిన్ని సారా రహిత గ్రామాలుగా గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వారికి చేయూతనందిం చనున్నారు. సారా కాయడం, అమ్మడం ద్వారా జీవనో పాధిని పొందిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం వారికి వేరే ఉపాధిని కల్పించడం ద్వారా వారిలో మార్పును సాధించగలిగారు. ఏజెన్సీలోను సారాను అరికట్టగలిగారు.
నవోదయం–2.0లో సారా తయారీ కేంద్రాలు, వాటి సామర్థత, రవాణా వంటి వాటిపై ఏ, బీ, సీ గ్రేడులుగా విభజించి చర్యలు తీసుకున్నారు. ‘ఏ’ కేటగిరి కింద సారా తయారీ, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయ డం వస్తుంది. ‘బీ’ కేటగిరిలో సారా తయారీ, అక్కడే విక్రయాలు, ‘సీ’ కేటగిరి కింద కేవలం విక్రయా లు మాత్రమే వస్తుంది. జంగా రెడ్డిగూడెం ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో జంగారెడ్డిగూడెం, కుక్కునూ రు, జీలుగుమిల్లి, వేలేరు పాడు మండలాలు, పోల వరం ఎక్సైజ్ శాఖా కార్యాలయం పరిధిలో పోలవరం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల పరిధిలో 57 గ్రామాలను గుర్తించారు.
గుర్తించిన సారా రహిత గ్రామాలు..
జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ శాఖ పరిధిలోని జంగారెడ్డిగూడెం మండలంలో ‘బీ’ కేటగిరి కింద మైసన్నగూడెం, పంగిడిగూడెం, పుట్లగట్లగూడెం, దేవులపల్లి, తిరుమలాపురం, ‘సీ’కేటగిరి కింద పేరంపేట, లక్కవరం, చక్రదేవరపల్లి గ్రామాలను గుర్తించారు. కుక్కునూరు మండలంలో ‘ఏ’ కేటగిరిలో మారేడుబాక, శ్రీధర్‌వేలేరు, బంజరగూడెం, ‘సీ’ కేటగిరి కింద దాచారం, కొండపల్లి, ఉప్పేరు, చీరవల్లి గ్రామాలను గుర్తించారు. జీలుగుమిల్లి మండలంలో ‘ఏ’ కేటగిరి కింద ములగలం పల్లి, కామయ్యపాలెం, ‘సీ’ కేటగిరిలో పి.అంకంపాలెం గ్రామాలను గుర్తించారు. వేలేరుపాడు మండలంలో వసంతవాడ, బండ్లబోరు, యర్రబోరు గ్రామాలను ‘ఏ’కేటగిరి కింద, వేలేరుపాడు, కన్నయ్యగుట్ట, రుద్రమకోట గ్రామాలను సీ–కేటగిరి కింద గుర్తించారు. పోలవరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కార్యాలయ పరిధిలోని పోలవరం మండలంలో ‘ఏ’ కేటగిరి కింద ఎల్‌ఎన్‌డీ పేట, కొమ్ముగూడెం, మెత్తప్పకోట, ‘బీ’కేటగిరి కింద కుంకాల, కోయనాగంపాలెం, మన్నుగోపుల, జిల్లెళ్లగూడెం గ్రామాలు, సీ–కేటగిరి కింద పోలవరం, పట్టిసీమ గ్రామాలను గుర్తించారు. కొయ్యలగూడెం మండల పరిధిలో ‘బీ’కేటగిరిలో గంగవరం, రాజవరం, సీ–కేటగిరిలో వేదాంతపురం, కన్నాపురం, ఎంపీడీపేట, గవరవరం, బోడిగూడెం, యర్రంపేట, సరిపల్లి, సీతంపేటలను గుర్తించారు. బుట్టాయిగూడెం మండల పరిధిలో ‘ఏ’కేటగిరి కింద ముద్దప్పగూడెం, కొవ్వాడ, బుద్దులవారిగూడెం, కొల్లాయిగూడెం, టి.కట్టుపల్లి గ్రామాలు, ‘బీ’కేటగిరి క్రింద రాజానగరం, యర్రయిగూడెం, లక్ష్మీపురం గ్రామాలు, సీ–కేటగిరి కింద డిప్పకాయలపాడు, కోయరాజమండ్రి, అంతర్వేదిగూడెం, రావిగూడెం, ముప్పినవారిగూడెం, రెడ్డిగణపవరం గ్రామాలను గుర్తించారు.
లింగపాలెంలో ‘నవోదయం’ 2.0
లింగపాలెం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): నవో దయం 2.0 కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామా లలో సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత అన్నారు. లింగపాలెంలో బుధవారం చింతల పూడి నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలతో నవోదయం2.0 కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమిష నర్ శ్రీలత, ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్‌శాఖ అసిస్టెంట్ కమిష నర్ కేవీఎన్ ప్రభుకుమార్ తదితర అఽధికారులు హాజర య్యారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో నారా తయారీ, విక్రయాలతో జీవనాన్ని కొనసాగించేవారు ఆ పనులను మానుకోవాలన్నారు. జిల్లాలో నవోదయం2.0 కార్యక్రమం ద్వారా ఎంపికైన వారికి ముఖ్యంగా మహిళలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. నియోజక వర్గంలో గుర్తించిన 42 కుటుంబాలకు ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగా రావు, ఎక్సైజ్ సీఐ పి.అశోక్, ఎక్సైజ్ ఎస్‌ఐలు అబ్దుల్‌ఖలీల్, జగ్గారావు, ఎంపీడీవో కే వాణి, డీఆర్‌డీఏ ఏపీడీ అనిత, వివిధ శాఖలకు చెందిన పలువురు అఽధికారులు పాల్గొన్నారు.