Share News

ప్రకృతి సేద్యం

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:09 AM

ప్రకృతి సేద్యాని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. ఎరువులు, పురు గుమందులు వాడకం లేని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తే ఆరోగ్య సమాజం ఏర్పాటుకానుందని భావిస్తోంది.

ప్రకృతి సేద్యం

సేంద్రియ సాగుపై జిల్లాలో మహిళలకు భాగస్వామ్యం

వరి, కూరగాయలు, పండ్లు

పెంపకం యూనిట్‌లు

మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రకృతి సేద్యాని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. ఎరువులు, పురు గుమందులు వాడకం లేని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తే ఆరోగ్య సమాజం ఏర్పాటుకానుందని భావిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సమాఖ్య ప్రకృతి సహజ వ్యవసాయం ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతి మండలంలోనూ ఎరువులు, రసాయనాలు వినియోగించని ఉత్పత్తులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ అభివృద్ధి సంస్థకు జిల్లా కలెక్టర్‌ ఆ దిశగా ఆదేశాలు జారీచేశారు. ప్రతి మండలంలోనూ మహిళలతో ప్రకృతి సేద్యంలో ఒక యూని ట్‌ను ఏర్పాటు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. ప్రకృతి సేద్యంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా మహి ళలకు అందించనున్నారు. బ్యాంకుల రుణాలు కూడా మంజూరు చేయిస్తారు. వరి, కూర గాయలు, పండ్లు ఉత్పత్తి చేసే మార్కెట్‌లో అమ్మకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది.మండలానికి ఒక విక్రయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ కేవలం ప్రకృతి సేద్యంలో ఉత్పత్తి అయ్యే బియ్యం, కూరగాయలు, పండ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల కుటుంబాలకు ప్రకృతి సేద్యంలో ప్రాధాన్యం ఇస్తారు. విక్రయ కేంద్రంలో అమ్మకం బాధ్యతలను వారికే అప్పగిస్తారు.ఇటీవల ప్రకృతి సేద్యంలో ఉత్పత్తి అయ్యే పంటలకు గిరాకీ ఉంటోంది. ప్రత్యేకంగా వినియోగ దారులే సంబంధిత విక్రేతల వద్దకు వెళ్లి బియ్యం, అపరాలు, చిరుధాన్యాలను కొను గోలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మార్కె ట్‌లోనే వీటికి గిరాకీ ఉంటోంది. అధిక ధరలకు సరకులు అమ్ముడు పోతున్నాయి. మాల్స్‌లోనూ ప్రకృతి ఉత్పత్తులను అమ్మకాలు సాగిస్తున్నారు.

రైతులకు పెట్టుబడి తగ్గించే యోచన

ప్రకృతి వ్యవసాయంలో రైతులకు పెట్టు బడి తగ్గనుంది. చీడపీడల బాధ తగ్గుతుంది. పురుగుమందులు, ఎరువులను ఉపయో గించకపోతే పెట్టుబడి తగ్గుముఖం పడుతుంది. సదరు ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధర లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తున్నాయి. వ్యవసాయశాఖ ప్రతి మండలంలోనూ ప్రత్యేకంగా ఇటు వంటి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తోంది. ఇకపై ప్రతి మండలంలోనూ మహిళా సంఘాల ద్వారా తొలుత ఒక్కో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో యూనిట్‌లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచించారు. ఇప్పటికే చేపలసాగు, కోళ్ల పెంపకం, పాడి సంపదపై మహిళలను భాగస్వామ్యం చేసేలా యూనిట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి యూని ట్‌లకు మహిళా సంఘాల నుంచి స్పందన తక్కువగా ఉంటోంది. ఇతర జిల్లాలో లక్ష్యాలను చేరుకుంటున్నారు. దాంతో జిల్లాలో ప్రకృతి సేద్యంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో దీనిపై మహిళా సంఘాల నుంచి స్పందన ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:09 AM