30న పెనుగొండలో సాహితీ సదస్సు
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:14 AM
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత మునిపల్లి రాజు శతజయంతి సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి సౌజన్యంతో ఎస్‌వీకేపీ అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 30న జాతీయ స్థాయి సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు తెలిపారు.
పెనుగొండ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత మునిపల్లి రాజు శతజయంతి సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి సౌజన్యంతో ఎస్‌వీకేపీ అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 30న జాతీయ స్థాయి సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమితో కలిసి కళాశాల ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుఅని తెలిపారు. జాతీయ సదస్సు వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్‌వైవీవీ అప్పారావు, సదస్సు డైరెక్టర్ రంకిరెడ్డి రామ్మోహనరావు, సదస్సు కన్వీనర్ డాక్టర్ కెవీఎన్‌డీ.వర ప్రసాద్, కళాశాల తెలుగు శాఖ అధ్యపకులు షేక్ ఆదంషా, కె.సురేష్ బాబు, కేవీ.సుబ్బారావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, పరిశోధకులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారన్నారు. ప్రముఖ కథ, నవల, కవిత్వ, వ్యాస రచయిత అయిన మునిపల్లె రాజుసాహిత్యంపై జరుగుతున్న ఈ జాతీయ సదస్సుకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి కలిగిన వారందరిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు.