జాతీయ ఉత్తమ అధ్యాపకునిగా దేవానంద్
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:26 AM
ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన డాక్టర్ మెండా దేవానంద్‌కుమార్ ఉత్తమ జాతీయ అధ్యాపకునిగా ఎంపికయ్యారు.
మండవల్లి/మైలవరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన డాక్టర్ మెండా దేవానంద్‌కుమార్ ఉత్తమ జాతీయ అధ్యాపకునిగా ఎంపికయ్యారు. గురు పూజోత్సవం రోజు సెప్టెంబరు 5న న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోను న్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకు లుగా పనిచేస్తున్న దేవానంద్ విద్యార్థులకు విద్యాబోధనలు అందించడమే కాకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తెలుగులో ఎం.ఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ, ఎంఏ హిస్టరీ, బీఈడీ, ఎంఈడీ చేసి యూజీసీ నీట్, స్లేట్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి అధ్యాపకునిగా కెరీర్ ప్రారంభించారు. 38 పరిశోధక పత్రాలు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి, ఐదు గ్రంథాలు రాశారు. 2021 నుంచి లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న దేవానంద్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేశారు. జర్నలిజం, తాళపత్ర గ్రంఽథాల రచన, జీవన నైపుణ్యాలను అనువాదం వంటి విషయాలపై 12 సర్టిఫికెట్ కోర్సులు నిర్వ హించారు. విద్యార్థులతో నిరంతరం మ మేకమయ్యే దేవనంద్ పలు సాంస్కృతిక కార్యక్ర మాలు, కళాశాల యూత్ ఫెస్టివల్ లహరి కళాశాల వార్షి కోత్సవం వార్షిక పాఠ్యాంశాలపై విద్యార్థులతో కళాశాల బోధి స్టూడియోలో విద్యాపరమైన వీడియో లు తీయడం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర వహించారు. జాతీయ అవార్డు గ్రహీతకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. గత ఏడాది సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024ను అందుకు న్నారు. మండవల్లికి ఇంతటి గుర్తింపు తీసు కువచ్చినందుకు గ్రామ సర్పంచ్ మెండా ఝాన్సీ, సురేష్‌బాబు గ్రామ స్థులు అభినందించారు.
చాలా సంతోషంగా ఉంది
దేశం మొత్తం మీద ఎంపికైన 21 మందిలో నేను ఒకడిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అవార్డు నాలో మరింత స్ఫూర్తిని నింపింది. ఇలాంటి అవార్డులు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు రావడం ప్రభుత్వ కళాశాలల మీద విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి.
– దేవానంద్‌కుమార్