జంగారెడ్డిగూడెంలో హంతక ముఠా అరెస్ట్
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:06 AM
వారం తా 25 నుంచి ముప్పై ఏళ్లలోపు యువకులే. వ్యసనాలకు లోనై ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు.
వారంతా చోరీలకు పాల్పడే ముఠా
సొత్తు పంపకాల్లో విభేదాలు
ముఠా సభ్యుడి దారుణ హత్య
జంగారెడ్డిగూడెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వారం తా 25 నుంచి ముప్పై ఏళ్లలోపు యువకులే. వ్యసనాలకు లోనై ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. చోరీ సొత్తు పంపకాల్లో తేడా రావడంతో గొడవపడ్డారు. చివరకి ముఠాలో ఒకరిని దారుణంగా హతమార్చారు. హంతక ముఠా చివరికి పోలీసులకు పట్టుబడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముఠాలో ముగ్గురు అన్నదమ్ములు. మరో నలుగురు స్నేహితులు కలిసి అనేక ఇళ్లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదల కాగానే తిరిగి చోరీలకు పాల్పడ్డారు. పంపకాల్లో తేడాతో ముఠాలో వ్యక్తినే చంపి హంతకులయ్యారు.
జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు వంతెన వద్ద ఈ నెల 3న కర్రి రాజేశ్ (26)ను హత్య చేసిన ఆరుగురు దొంగల ముఠా సభ్యులు షేక్ ఖాశిం, షేక్ నాగుల్ మీరా, వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్, సమ్మంగి మంగరాజు, షేక్ జహీరు ద్దీన్ అలియాస్ చోటు, మరీదు సాయి అలియాస్ సైకో సాయిని హత్య జరిగిన మరుసటి రోజు శనివారం జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కరిపై 3 నుంచి 10 చోరీ కేసులున్నాయని డీఎస్పీ యు.రవిచంద్ర ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో తెలిపారు.
చాకుతో పొడిచి.. పీక కోసి..
మృతుడు రాజేశ్, హత్యకు ప్రధాన సూత్రధారి షేక్ ఖాశిం స్నేహితులు. ఇద్దరూ కలిసి అనేక ఇళ్లలో చోరీలు చేశారు. కొంత కాలం క్రితం వరంగల్ జిల్లాలో చోరీ సొత్తు పంపకాల్లో రాజేశ్, ఖాశిం మధ్య విభేధాలు వచ్చాయి. రాజేశ్‌పై కక్షతో ఖాశిం సోదరులు నాగుల్ మీరా, జహీరుద్దీన్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రాజేశ్ హత్యకు పథకం రచించాడు. పలు కేసుల్లో నిందితుడైన రాజేశ్ పరారీలో ఉన్నాడు. ఈ నెల 3న రాజేశ్ ఇంటికి వచ్చాడని తెలిసి వెంటాడి పట్టుకుని బలవంతంగా మోటార్ సైకిల్‌పై బైనేరు వంతెన సమీపానికి తీసుకెళ్లారు. ఆరుగురు కలిసి రాజేశ్‌ను కొట్టి టవల్‌తో కాళ్లను కట్టేసి పొట్టలో చాకుతో బలంగా పొడి చి పీక కోసి దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఎస్సై ఎస్ కె.జబీర్ కేసు నమోదు చేయగా సీఐ ఎంవీ.సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క రోజులోనే నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండుకు పంపను న్నట్లు డిఎస్పీ తెలిపారు. వీరందిరిపై షీట్లు తెరుస్తా మని, వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. సమా వేశఽంలో సీఐ ఎంవి.సుభాష్, ఎస్సై ఎస్‌కె.జబీర్, ఏఎస్సై ఎన్‌వి.సంపత్ కుమార్, పీసీలు ఉన్నారు.