మునిసిపల్ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:45 AM
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. ఏలూరు మునిసి పల్ కార్యాలయం వద్ద బుధవారం కార్మికులు ధర్నా నిర్వహించారు.
నవంబరు మూడు నుంచి నిరవధిక సమ్మెకు సన్నాహం
ఏలూరుటూటౌన్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. ఏలూరు మునిసి పల్ కార్యాలయం వద్ద బుధవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మునిసిపల్ కార్మికులు 2023 సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు కిశోర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే నవంబరు మూడో తేదీ నుంచి నిరవదిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఉప్పులూరి హేమశంకర్, ఎ.లక్ష్మీఇందిరా, వరప్రసాద్, ఎస్.సుబ్బారావు, నారాయణ రావు, ఎస్‌కే.ఆలీ, కె.శ్రీనివాసరావు, సీహెచ్ అప్పారావు, బంగారు అక్కమ్మ, ధనియాల రమణమ్మ పాల్గొన్నారు.
భీమవరంటౌన్: మునిసిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరిం చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహిం చారు. నాయకులు నీలాపు శ్రీను, రెల్ల రాము, బి.సత్యనారాయణ, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం :మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆఽధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఓవీ రాజు మందలపర్తి హరీష్, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు.
తణుకు: సమస్యలు పరిష్కారం కోరుతూ మునిసిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి మునిసిపల్ కమిషనర్ కె.ఈశ్వర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మునిసిపల్ వర్కర్సు యూనియన్ గౌరవాధ్యక్షుడు బొద్దాని నాగరాజు మాట్లాడుతూ కనీసవేతనం రూ.26వేలు అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటించి 30శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, మునిసిపాలిటీ విస్తరణకు అనుగునంగా డైలీ వేజ్ కార్మికుల నిష్పత్తి పెంచాలని డిమండ్ చేశారు.