Share News

కొవిడ్‌లో తినేశారు

ABN , Publish Date - May 09 , 2025 | 12:32 AM

కొవిడ్‌ సమయంలో భీమవరం మునిసిపాల్టీ నుంచి చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కొవిడ్‌లో తినేశారు

బిల్లుల చెల్లింపులో మునిసిపల్‌ అధికారుల అవకతవకలు

ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు

ఉన్నతాధికారుల ఉత్తర్వులు

భీమవరం టౌన్‌, మే 8(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో భీమవరం మునిసిపాల్టీ నుంచి చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ సమయంలో కొనుగోలు చేసిన సామగ్రి బిల్లుల్లో తేడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యా దులు అందడంతో విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. తేడాలు గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు మునిసిపల్‌ ఉన్న తాధికారులకు నివేదిక పంపించారు. అధికారుల పరిశీలన అనంతరం అవకతవకలతో సంబంధాలున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఎంఎ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొవిడ్‌ సమయంలో మునిసిపల్‌ కమిషనర్లుగా పనిచేసిన ఇద్దరు, ఎఫ్‌–1 సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌, ఎఫ్‌–2 సెక్షన్‌ జూనియర్‌ అసి స్టెంట్‌, హెల్త్‌ అసిస్టెంటు, ఏఈలు ఇద్దరు, సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు ఉన్నారు. వారిపై మునిసిపల్‌ అధికా రులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి ఫిర్యాదు తయారుచేసి ఇవ్వాలని పోలీసులు మునిసిపల్‌ అధికారులకు సూచించారు. మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో పనిచేసిన కమిషనర్‌ కె.రమేష్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ కామేష్‌బాబు, జూనియర్‌ అసిస్టెంట్‌ జీవీ.మధు చంద్రశేఖర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ఎస్‌.చంటిబాబు, ఏఈ వీవీఎస్‌.కోటేశ్వరరావు, ఏఈ కె.రాజకుమార్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కమిషనర్‌ రామచంద్రారెడ్డి తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 12:32 AM