Share News

మున్సిపల్‌ ఎన్నికలు పాత పద్ధతిలోనే..

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:23 AM

జిల్లాలోని మునిసిపల్‌ ఎన్నికలపై స్పష్టత వస్తోంది. విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మున్సిపా లిటీల్లో వార్డుల వారీగా పట్టణ సరిహద్దుల వివరాలను అందజేయాలని ఎన్నికల అధికారులు కోరారు.

మున్సిపల్‌ ఎన్నికలు పాత పద్ధతిలోనే..

విలీన గ్రామాలకు మినహాయింపు

మొగ్గు చూపుతున్న ప్రభుత్వం

వార్డులు, పట్టణాల సరిహద్దుల వివరాలు కోరిన ఎన్నికల అధికారులు.. పాత వాటినే సమర్పించిన మున్సిపాలిటీలు

ఆ దిశగానే ఎన్నికలు జరిగే అవకాశం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని మునిసిపల్‌ ఎన్నికలపై స్పష్టత వస్తోంది. విలీన గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మున్సిపా లిటీల్లో వార్డుల వారీగా పట్టణ సరిహద్దుల వివరాలను అందజేయాలని ఎన్నికల అధికారులు కోరారు. ఆ మేర కు మున్సిపాలిటీల నుంచి వివరాలను అందజేశారు. పాత వార్డులు ఆధారంగానే వివరాలను సమర్పించారు. దీంతో గతంలోవున్న వార్డులకే ఎన్నికలు నిర్వహించేం దుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విలీన గ్రామాలపై కోర్టుల్లో కేసులు ఉండడంతో వాటి జోలికి అధికారులు పోలేదు. సాంకేతికంగా విలీనమైనప్పటికీ పాలనాపరం గా, న్యాయపరంగా పంచాయతీలు విలీనానికి నోచుకో లేదు. గడచిన ఐదేళ్లపాటు మున్సిపాలిటీలు విలీన సమ స్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఓవైపు ఎన్నికలు జరగలేదు. మరోవైపు ఆర్థిక సంఘం నిధులకు నోచుకో లేదు. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుప డింది. మున్సిపాలిటీల్లో అధికారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రస్తుతం విచారణ లు ఎదుర్కొంటున్నారు. విలీన గ్రామాల్లోనూ ఇదే పరి స్థితి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన ఆస్తి పన్ను నే కార్యదర్శులు బొక్కేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాలతో సంబంధం లేకుండానే మున్సిపాలిటీలకు ఎన్నిక లు నిర్వహించాలని కసరత్తు చేసింది. కానీ అడుగు ముందుకు పడలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సి పాలిటీలకు ఎన్నికలు జరగలేదు. అందులో విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించలేని దుస్థితి. వైసీపీ ప్రభుత్వహయాంలో విలీనం సక్రమ పద్ధతిలో చేయక పోవడంతో సమస్య ఉత్పన్నమైంది. స్థానిక సంస్థల పాలకవర్గాలకు ఐదేళ్లు పూర్తవుతుండడంతో రాష్ట్ర ఎన్ని కల సంఘం ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. జనవరిలోనే ప్రక్రియ పూర్తికావాలని తలచింది. అందుకు తగిన ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలోనూ కసరత్తు మొదలైంది. తాజాగా మున్సిపాలిటీల్లో వార్డుల సరిహ ద్దులతో వివరాలను కోరారు. పాత వార్డుల ప్రకారమే మున్సిపాలిటీల్లో వివరాలను సమర్పిస్తున్నారు. పాలకొ ల్లు మున్సిపాలిటీ నుంచి వివరాలు సమర్పించాలి.

రిజర్వేషన్‌లపై ఉత్కంఠ

పాత పద్థతిలో ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్‌లు మారే అవకాశం ఉంది. విలీన గ్రామాలతో కలిపి గతం లో మున్సిపాలిటీలకు రిజర్వేషన్‌ ఖరారు చేశారు. న్యా యపరమైన చిక్కులతో ఎన్నికలు నిర్వ హించలేకపోయారు. అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎన్నికలపై శ్రద్ధ చూపలేదు. మున్సిపాలిటీల్లో తమ ఆధి పత్యం ఉండాలన్న ఉద్దేశంతో పట్టణాల కు పాలకవర్గాలు లేకుండానే గడిపేశా రు. తాజాగా ప్రభుత్వం ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం నుం చి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. వాస్తవానికి విలీ న గ్రామాలతో వార్డులు పెరిగాయి. హద్దులను మార్చా రు. అలా కాకుండా విలీనానికి ముందున్న పద్ధతిలోనే ఇప్పుడు ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశ గానే వార్డుల హద్దులను నిర్ణయించి సమాచారాన్ని పంపారు. దాంతో రిజర్వేషన్‌లు మారే అవకాశం ఉంద ని అంతా భావిస్తున్నారు. ఎవరికి వారే ఈసారి తమ సామాజిక వర్గాలకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నా రు. ఆశావహుల్లోనూ జోష్‌ నెలకొంది. మున్సిపల్‌ ఎన్ని కల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్‌లే ఇప్పుడు కూట మి నేతల తలరాతలు మార్చనున్నాయి.

్చమున్సిపాలిటీలు వార్డులు

భీమవరం 39

తాడేపల్లిగూడెం 35

తణుకు 34

పాలకొల్లు 31

నర్సాపురం 31

Updated Date - Sep 14 , 2025 | 12:23 AM