Share News

మరో ఆరు నెలలు వీరే

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:27 AM

మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారుల పాలన ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గాలు లేని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీలకు ఆరు మాసాల క్రితం నియమించిన ప్రత్యేకాధికారుల గడువు ముగియడంతో దీనిని మళ్లీ పెంచారు.

మరో ఆరు నెలలు వీరే

భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలకు ప్రత్యేకాధికారులు పొడిగింపు

ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు

భీమవరం టౌన్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి):మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికారుల పాలన ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గాలు లేని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీలకు ఆరు మాసాల క్రితం నియమించిన ప్రత్యేకాధికారుల గడువు ముగియడంతో దీనిని మళ్లీ పెంచారు. భీమవరం మునిసిపాల్టీకి ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పాలకొల్లుకు నరసాపురం ఆర్డీవో దాసి రాజు, తణుకుకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారాయణరెడ్డి, తాడేపల్లిగూడెంకు ఆర్డీవో ఖతీబ్‌ కౌసర్‌ కొనసాగుతున్నారు. వారి ఆమోదంతోనే మున్సి పాలిటీల్లో పాలన సాగుతోంది.

గత ప్రభుత్వ హయాంలో న్యాయపరమైన చిక్కులు కారణంగా ఈ మున్సిపాలిటీలకు ఎన్ని కలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ప్రత్యేకా ధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. అక్కడ వార్డులు, ఓటర్లు, జనాభా సంఖ్య పెరి గింది. రిజర్వేషన్‌లను ప్రకటించారు. ఎన్నికల ముందే విలీన గ్రామాలపై హైకోర్టు స్టే విధిం చడంతో ఎన్నికలు జరగక పాలక వర్గాలు ఏర్ప డలేదు. దీనివల్ల మున్సిపాలిటీలతోపాటు, విలీన గ్రామాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పాలకవర్గాలు లేకపోతే కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వనరులపై దృష్టి పెట్టింది. వాయిదా పడ్డ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. విలీన గ్రామాలను మినహాయించి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేశారు. కానీ ఆచరణకు నోచుకోలేదు.

అన్నింటికీ ఒకేసారి

రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటిం చింది. పాత పద్ధతిలోనే మున్సిపాలిటీల నుంచి వార్డులు, ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం కోరింది. అంటే విలీన గ్రామాలను మినహాయిస్తున్నట్టు స్పష్టత వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీల రిజర్వేషన్లపైనే చర్చ సాగుతోంది. ఆశావహలు రిజర్వేషన్‌పై ఉత్కంఠతో ఉన్నారు. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. అందుకోసమే ప్రభుత్వం మరో అరు నెలలపాటు ప్రత్యేకాధికారుల పాలనా గడువును పెంచింది.

Updated Date - Nov 23 , 2025 | 12:27 AM