Share News

సమన్వయంతో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:41 AM

ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు సమన్వ యంతో వ్యవహరిస్తూ సానుకూలంగా స్పందిస్తేనే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు పరిష్కార మవుతాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అన్నారు.

సమన్వయంతో సమస్యల పరిష్కారం
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌

ముదినేపల్లి ప్రజావేదికలో ఏలూరు ఎంపీ మహేశ్‌కుమార్‌

ముదినేపల్లి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు సమన్వ యంతో వ్యవహరిస్తూ సానుకూలంగా స్పందిస్తేనే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు పరిష్కార మవుతాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అన్నారు. ముదినేపల్లి ‘వి’ కన్వెన్షన్‌ హాలులో బుధవారం నిర్వహించిన కైకలూరు నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీ మాట్లాడుతూ.. ‘సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రజా సమస్యలను తీర్చడం నాయకులు, అధికారులు తమ బాధ్యతగా భావించాలి. కొల్లేరు ప్రజల జీవనోపాధి మెరుగుపర్చడం, డిఫామ్‌, జిరాయితీ భూముల పంపిణీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో అన్ని మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహి స్తాం’ అని తెలిపారు. ప్రజల నుంచి 125 వినతులు రాగా వాటిని పరిశీలించి అయా శాఖల అధికారులతో సమీక్షించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ వీరమల్లు నరసింహారావు, మెంటే పార్థసారఽథి, చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొడాలి వినోద్‌, కొత్తా నాగేంద్ర కుమార్‌, పెన్మెత్స త్రినాథరాజు, కోటప్రోలు కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:41 AM