Share News

ఒకే ప్రాంతానికి రెండు ఎంపీ పదవులు అరుదు

ABN , Publish Date - May 24 , 2025 | 12:29 AM

ఒకే పార్టీ నుంచి ఒకేచోట ఇద్దరు పార్లమెంట్‌ సభ్యుల ఎంపిక చాలా అరుదు అని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు.

ఒకే ప్రాంతానికి రెండు ఎంపీ పదవులు అరుదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పాకా సత్యనారాయణ

28న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం : పాకా

భీమవరం టౌన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ఒకే పార్టీ నుంచి ఒకేచోట ఇద్దరు పార్లమెంట్‌ సభ్యుల ఎంపిక చాలా అరుదు అని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవితో కలసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ ఎంపీగా ఎన్నిక కాగా తాను రాజ్యసభకు ఎన్నిక కావడాన్ని ప్రస్తావించారు. భౌగోళికంగా తామిద్దరం ఒకే ఊరి వాళ్లం అన్నారు. తాను రాష్ట్రమంతటా పనిచేస్తున్న విషయం పార్టీ అధి ష్ఠానానికి తెలుసన్నారు. ఈ నెల 28న తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మా ప్రాంత అభివృద్ధిలో లోక్‌సభ సభ్యుడు, మంత్రి శ్రీనివాస్‌ వర్మ కు తాను కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి, మరింత అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుందని సత్యనారాయణ అన్నారు. తన ఎంపికపై బీజేపీ కేంద్ర, రాష్ట్ర కమిటీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పని చేసే కార్యకర్తకు గుర్తింపు ఇవ్వ గలిగిన సత్తా కలిగిన పార్టీ అని, వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడికి సముచిత స్థానం కల్పించిన పార్టీగా బీజేపీ నిరూపించుకుంద న్నారు. అత్యున్నత పదవిగా భావించే రాజ్యసభకు ఎంపిక చేసే వారిని కుల మతాలు చూడకుండా పార్టీకి నిబద్ధ త క్రమశిక్షణ ఆధారంగానే కాకుండా విషయాలపై అవగాహన, తదితర అంశాలను ప్రామా ణికంగా తీసుకుని తనను ఎంపిక చేసినట్లు వివరిం చారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారనికి 28న ఉప రాష్ట్రపతి అవకాశం కల్పించారని పాకా సత్యనా రాయణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోటోకాల్‌ను గౌరవిస్తూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గరాజు, కోమటి రవికుమార్‌, బీజేపీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి ఉన్నమట్ల కపర్ది, నారిన తాతాజీ, అడబాల శివ, వబిలిశెట్టి ప్రసా దరావు, అల్లూరి పద్మ వర్మ, కాగిత సురేంద్ర, ఇంజేటి వెంకటేశ్వర్లు, పెదప్రోలు రాఘవులు, పుల్లాజి, తోట గంగరాజు, గంగుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:29 AM