Share News

మాయా బజార్‌

ABN , Publish Date - May 31 , 2025 | 12:34 AM

అదొక మాయా బజార్‌.. పెనుగొండ, సమీప గ్రామాల్లో ద్విచక్ర వాహన విడి భాగాల దుకాణాలు నిర్విరామంగా వ్యాపారం సాగిస్తాయి.

మాయా బజార్‌
గుట్టలుగా పోసిన ద్విచక్ర వాహన విడి భాగాలు

గుట్టలుగా ద్విచక్ర వాహనాల విడి భాగాలు

యథేచ్ఛగా బహిరంగ విక్రయాలు

అర క్షణంలో అడిగిన పరికరాలు

సామాన్యులకు అందుబాటు ధరలో..

కొరవడిన అధికారుల నిఘా

అదొక మాయా బజార్‌.. పెనుగొండ, సమీప గ్రామాల్లో ద్విచక్ర వాహన విడి భాగాల దుకాణాలు నిర్విరామంగా వ్యాపారం సాగిస్తాయి. దుకాణంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. ఎవరికైనా ఏ విడి భాగం కావాలని అడిగినా క్షణాల్లో చేతిలో పెడతారు. లోపల చూస్తే పాత ఇనుప సామగ్రిని తలపిస్తాయి. ఏదో మేజిక్‌ లేదా మాయ చేసినట్లు కొద్ది నిమిషాల్లో ద్విచక్ర వాహనం సిద్ధమవుతుంది. ఎవరు ఎక్కడి నుంచి ఏ వాహనం తెస్తారో తెలియదు. వందల వాహనాలు అక్కడ పడి ఉంటాయి. పక్కనే వందలు, వేల విడి భాగాల గుట్టలు ఉంటాయి. అందుబాటు ధరలో వాహన విడి భాగాలు లభ్యమవుతాయి. స్థానికంగా విక్రయాలే కాదు పెద్ద వాహనాల్లో ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తారు.

పెనుగొండ, మే 30(ఆంధ్రజ్యోతి): పెనుగొండ, పరిసర రెండు గ్రామాల్లో ద్విచక్ర వాహన విడిబాగాల వ్యాపారం అందరిని విస్తుబోయేలా చేస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల ను ఇక్కడకు తీసుకొచ్చి క్షణాల్లో ఎవరూ గుర్తుపట్టనివిధంగా విడి భాగాలు వేరు చేస్తారు. వాటిని స్థానికంగా కావలసిన వారికి విక్రయి స్తారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తారు. కొనుగోలు, అమ్మకాలతో ఏటా లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఒక అంచనా. నిఘా యంత్రాంగం ఇక్కడి కార్యకలాపాలపై దృష్టి సారించకపోవడం వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

భారీ ఎత్తున సాగే వ్యాపార ప్రాంగణంలోకి అందరిని అనుమతించరు. ఏ విడి భాగం కావా లో చెబితే వారే క్షణంలో తెచ్చి చేతిలో పెడతా రు. టైర్లు, రిమ్‌లు, సైలెన్సర్లు, ఇంజన్లు, ఏ చిన్న విడి భాగమైనా ఇక్కడ లభిస్తుందని పలువురు చెబుతారు. మెకానిక్‌లకు సైతం భలే ఆదాయం. ఇక్కడ తళతళలాడే ద్విచక్ర వాహనాలు సైతం అమ్మకానికి ఉండడం గమనార్హం.

పేదోడి షోరూమ్‌!

పెనుగొండలో ద్విచక్ర వాహనాల విడిబాగాల వ్యాపారం కొందరు మాయా బజార్‌ అం టే మరికొందరు పేదోడి షోరూమ్‌ అంటారు. ద్విచక్ర వాహనదారు తన వాహనానికి సం బంధించిన విడిబాగాలు షోరూమ్‌లలో వేల రూపాయలు ఉంటే ఇక్కడ కావలసిన విడి భాగాన్ని తక్కువ ధరకే పొందుతాడు. దీంతో అనేక మంది వాహనదారులు తనకు కావాల్సిన విడిభాగాలకు ఇక్కడకు వచ్చి కావలసిన వాటిని తీసుకుని వెళుతుంటారు. దీంతో షోరూమ్‌ కంటే ఇక్కడే విడిభాగాలు కొనే వారితో సందడిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ వ్యాపారం ఎలాంటిదో గానీ పేదోడి షోరూమ్‌ అంటుంటారు.

దిగుమతి.. ఎగుమతి..!

ఆటోలు, లారీల్లో వివిధ ప్రాంతాల నుంచి పాత వాహనాలు ఇక్కడి తీసుకు వస్తున్నట్లు పలువురు చెబుతారు. నిత్యం సిద్ధంగా ఉండే సుమారు పది మంది కార్మికులు తెచ్చిన వాహనాలను క్షణాల్లో విడిభాగాలుగా మార్చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మరెక్కడా లేని విధంగా పెనుగొండతో పాటు సమీపం లోని రామన్నపాలెం, వడలి గ్రామాల్లో కూడా ఈ తరహా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు పది దుకాణాల్లో అమ్మకాలు చేస్తుండగా మిగిలిన వాహనాలు, విడి భాగాలను రెండు రోజులకోసారి లారీల్లో గుంటూ రు, విజయవాడ, విశాఖపట్టణం ఇతర పట్టణాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 31 , 2025 | 12:34 AM