Share News

నడిరోడ్డుపై ముచ్చటైన మాతృత్వం!

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:17 PM

రోజంతా ఎండనకా.. వాన నకా.. తిరుగుతుంది ఆ గోమాత. కాస్తంత మేత, గుక్కెడు నీళ్లకోసం పడే పాట్లు అన్నీ, ఇన్నీ కావు. తనకోసం ఆశగా చూసే తన ముగ్గురి బిడ్డలను చూడగానే ఆమె పడుతున్న కష్టమంతా మంచులా కరిగిపోతుంది.

నడిరోడ్డుపై ముచ్చటైన మాతృత్వం!
పాలకొల్లు పట్టణంలో ఒకేసారి మూడు దూడలకు పాలు ఇస్తున్న గోమాత

యలమంచిలి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రోజంతా ఎండనకా.. వాన నకా.. తిరుగుతుంది ఆ గోమాత. కాస్తంత మేత, గుక్కెడు నీళ్లకోసం పడే పాట్లు అన్నీ, ఇన్నీ కావు. తనకోసం ఆశగా చూసే తన ముగ్గురి బిడ్డలను చూడగానే ఆమె పడుతున్న కష్టమంతా మంచులా కరిగిపోతుంది. మా మూలుగా ఒక దూడ ఆకలితీర్చడానికే తల్లడిల్లే ఈ రోజుల్లో.. ఇదిగో ఇలా, నడిరోడ్డు మీదే, వాహనాల రొదను కూడా లెక్కచేయకుండా, ఒకేసారి తన ముగ్గురు పిల్లలకు గోమాత పాలిస్తున్న ఈ దృశ్యం నిజంగా అరుదు.. అద్భుతం!. గోమాతకు రోడ్డే ఇల్లు కావచ్చు, కానీ పిల్లలకు మాత్రం తల్లి పంచే ప్రేమే సర్వస్వం. చుట్టూ ప్రపంచం ఎంతవేగంగా పరిగెడుతున్నా.. ఆ నాలుగు ప్రాణాల ప్రపంచం మాత్రం ఆ పాలధారల్లో నిశ్చలంగా ఆగి పోయింది. పాలకొల్లు పట్టణంలోని బ్యాంక్‌ స్ర్టీట్‌లో కనిపించిన ఈ అరు దైన దృశ్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌ మనిపించింది. అమ్మ ప్రేమకు కొలమానం లేదనడానికి ఈ దృశ్యమే తార్కాణం.

Updated Date - Dec 23 , 2025 | 11:17 PM