Share News

తుఫాన్‌కు ఎదురొడ్డారు !

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:05 AM

జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ముందస్తు జాగ్రత్తలతో మొంథా తుఫాన్‌ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదు. ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. జిల్లాలోని 27 మండలాల్లోని 664 గ్రామాల్లో తుఫాన్‌ ప్రభావం చూపించింది.

తుఫాన్‌కు ఎదురొడ్డారు !
నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో పారిశుధ్య పనులు

ముందస్తు జాగ్రత్తలతో నష్ట నివారణ

పునరుద్ధరణ పనులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

విద్యుత్‌, రోడ్లు, ఇళ్లు దెబ్బతినడంతో రూ.72.26 లక్షల నష్టం

జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ముందస్తు జాగ్రత్తలతో మొంథా తుఫాన్‌ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదు. ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. జిల్లాలోని 27 మండలాల్లోని 664 గ్రామాల్లో తుఫాన్‌ ప్రభావం చూపించింది.

ఏలూరుసిటీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): . తుఫాన్‌ సహాయక చర్యలు నిమిత్తం ముంద స్తుగానే ఎక్స్‌కవేటర్లు, చెట్లు కట్‌ చేసే మిషన్లను రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాలు, జాతీయ రహదారిపై ఉంచారు. తుఫాన్‌ సమయంలో వీచిన పెనుగాలులకు జిల్లాలో 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు, 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు 90 వరకు, విద్యుత్‌ స్తంభాలు 123 నేలకూలాయి. గంట నుంచి రెండు గంటల్లోనే కొత్తవాటిని ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. రోడ్లపై పడిన చెట్లును ఆర్‌అండ్‌బీ శాఖ చెట్లు కట్‌ చేసే యంత్రా లతో తొలగించి రవాణా సౌకర్యాలకు ఆటంకం లేకుండా చేశారు. వర్షాల అనంతరం ఆయా గ్రామాల్లో డ్రెయిన్‌లలో మురుగు నిల్వ లేకుం డా, రోడ్లపై చెత్త నిల్వలేకుండా పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కాల్వలు, మైన ర్‌ ఇరిగేషన్‌ చెరువులు, వాగులకు పడిన గండ్లు పూడ్చడం, గట్లు పటిష్టం చేసే పనులను చేపట్టారు.

జిల్లాలో 93 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 3,422 మందిని తరలించి వారికి భోజన, వసతి సదుపాయాలు కల్పిం చారు. జిల్లాలో 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించారు. తుఫా న్‌ బాఽధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ వంటనూనె, రెండు రకాల కూరగాయలు కేజీ చొప్పున, 30 టన్నుల బియ్యం, 10 టన్నుల నిత్యావసర వస్తువులు, మూడు టన్నుల కూరగాయలు అధికారులు అందజేశారు. తుఫాన్‌ బాధితు లకు ప్రతి వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు మొత్తం రూ.34.22 లక్షలు అందజేశారు.

రూ.72.26 లక్షలు నష్టం

మొంథా తుపాను అనంతరం సహాయక చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌, జిల్లా ప్రత్యేకాధికారి కాంతీలాల్‌ దండే, కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు అధికారులు తుఫాన్‌ నష్టాలపై ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఆ ప్రకారం విద్యుత్‌, రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్న కారణంగా రూ.72.26 లక్షలు నష్టం వాటిల్లినట్టు పేర్కొ న్నారు. జిల్లాలో 24 ఇళ్లు దెబ్బతిన్నాయి.

వీడని భారీ వర్షాలు

మొంథా తుఫాన్‌ తీరం దాటినా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల పాటు ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురిసింది. కొండవాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిం చాయి. పోలవరం, బుట్టాయిగూడెం మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, లింగ పాలెం, కామవరపుకోట మండలాల్లో భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా పోలవరం మండలంలో 94.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 18.6 మి.మీ నమోదైంది. బుట్టాయిగూడెం 89.6, జంగారెడ్డిగూడెం 83.4, కొయ్యలగూడెం 63.8, లింగపాలెం 44.6, కామవరపుకోట 39.8, జీలుగుమిల్లి 22, చింతలపూడి 14.6, ముసునూరు 9.6, టి.నరసాపురం 8.2, ద్వారకాతిరుమల 7.4, భీమడోలు 7.2, చాట్రాయి 5.8, కలిదిండి 5.2, నూజివీడు 4.6, కుక్కునూరు 4.4, ఆగిరిపల్లి 4.2, వేలేరుపాడు 4, పెదవేగి 3.8, కైకలూరు 1.6, దెందులూరు 1.2, ఏలూరు అర్బన్‌ 1.2, ముదినేపల్లి 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

శానిటేషన్‌, పంట నష్టాల సేకరణపై దృష్టి సారించాలి

జిల్లాలో శానిటేషన్‌, పంట నష్టాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో తుఫాన్‌ అనంతరం సహాయక చర్యలపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి , తుఫాన్‌ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే, జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జిల్లా అఽధికారులతో మంత్రి గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ తుఫాన్‌ అనంతరం భారీ వర్షాల కారణంగా వరదనీరు ఎక్కడా నిల్వ లేకుండా చూడాలన్నారు. తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూడాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలని, దోమలు పెరగకుండా ఫాగింగ్‌ చేయించాలన్నారు. అంటు వ్యాఽధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయినవారి వివరాలు సేకరించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక మరమ్మతులపై నివేదిక సమర్పించాలని, స్వల్పకాలంలో చేయాల్సిన రోడ్డు మరమ్మతులను తుఫాన్‌ నిధుల నుంచి చేపట్టాలన్నారు. జేసీ అభిషేక గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి విన్నూత్న, ఆర్డీవోలు అచ్యుత్‌ అంబరీష్‌, రమణ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌, ఏపీఈపీడీసీఎల్‌, వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అఽధికారులు, తహసీల్దార్లు , ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 01:05 AM