Share News

మొంథా ముప్పు

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:45 AM

పశ్చిమ గోదావరి జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంది. బలమైన ఈదురుగాలులతో జిల్లాలోని పలు మండలాలు వణికిపోయాయి.

మొంథా ముప్పు
మొగల్తూరు తీరంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ అస్మీ, అధికారులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూకటి వేళ్లతో నేలకొరిగిన చెట్లు

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు..

వరి, అరటి తోటలు ధ్వంసం

(భీమవరం/ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉంది. బలమైన ఈదురుగాలులతో జిల్లాలోని పలు మండలాలు వణికిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో గ్రామాలు, పట్టణాల్లో అంధకారం అలుముకుం ది. వర్షాలు, ఈదురుగాలులకు 3,800 ఎకరాల్లో వరి నేల మట్టమైంది. పాలు పోసుకునే దశలో వరికి మొంథా ఉరి వేసినంత పనిచేసింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్ర రహదారుల పై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు కూకటివేళ్లతో నేలమట్టమయ్యా యి. తుఫాను సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం తలమునకలైంది. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి. మొగల్తూరు, కాళ్ల, భీమవరం రూరల్‌, ఆకివీడు, పాలకొల్లు రూరల్‌ తదితర మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

సహాయక చర్యలు ముమ్మరం

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోడానికి మూడు రోజుల ముందు నుంచే అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవడంతో సహాయక చర్యలు వేగవంతంగా జరుగు తున్నాయి. విరిగిన చెట్లను తొలగించి రాకపోకలను పునరిద్ధ రిస్తున్నారు. ఒరిగిన విద్యుత్‌ స్తంభాలను సరిచేస్తున్నారు.

ఏలూరులో 1506 హెక్టార్లకు నష్టం

ఏలూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దెందులూరు మండలంలో చెట్లు నేలకూలాయి. జిల్లాలో 1506 హెక్టార్లలో వరి, మినుము పంటకు నష్టం వాటిల్లింది. 17 మండలాల్లోని 84 గ్రామాల్లో 2020 మంది రైతులకు చెందిన వరి, మినుము పంట దెబ్బతింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోనే అత్యధికంగా పెదపాడులో 23.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కైకలూరు మండలంలో కొల్లేరు వరద ఉధృతి పెరిగింది. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 1300 క్యూసెక్కులు నీరు చేరుతుండగా దిగువకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కలెక్టర్‌, ప్రత్యేకాధికారి సమీక్ష

తుఫాను పునరావాస కేంద్రాలలో బాధితులకు అసౌక ర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి మంగళవారం నియోజకవర్గ మండల ప్రత్యేకాధికారు లు, జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తుఫాన్‌ సహాయక చర్యలపై జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష చేశా రు. జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలో సిబ్బంది అప్రమత్తత సూచనలు ఇవ్వాలని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అభిషేక్‌ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1937 మందిని తరలించినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ప్రతి పునరావాస కేంద్రంలో తుపాన్‌ బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. జిల్లాలో 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 318 మంది గర్భిణులను దగ్గరలోని పీహెచ్‌సీలకు తరలించినట్లు ఆయన వివరించారు.

75 వేల ఎకరాలకే పంటల బీమా!

భీమవరం రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):సార్వా సాగుకు తుఫాను దెబ్బ తప్పలేదు. మంగళవారం సాయంత్రం భారీ గాలులకు చాలాచోట్ల వరి చేలు నేలకొరిగా యి. ఎకరాకు రూ.200 చెల్లిస్తే రూ.40 వేలు బీమా వర్తించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించినా రైతులు పంటల బీమా చెల్లింపులో అలసత్యం శాపంగా మారనుంది.

Updated Date - Oct 29 , 2025 | 12:47 AM