Share News

రూ.78 లక్షలు మోసపోయిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:07 AM

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అపరిచితుల ఫోన్‌ కాల్‌కు మోసపోయారు.

రూ.78 లక్షలు మోసపోయిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

సీబీఐ అధికారులమంటూ బురిడీ

భీమవరం క్రైం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అపరిచితుల ఫోన్‌ కాల్‌కు మోసపోయారు. పట్టణంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేసి రిటైరైన ఎంవీజీఎస్‌ శర్మకు గత నెల 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీ ఫోన్‌ సిమ్‌లో తేడా ఉందని, తాము సీబీఐ, ఐపీఎస్‌ అధికారులమంటూ మెస్సేజ్‌ వచ్చింది. దీంతో భయపడిన శర్మ తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 78 లక్షల 60 వేల 150లు వారి అకౌంట్‌కు జమ చేశారు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన సైబర్‌ క్రైం అధికారులకు, సోమవారం భీమవరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రెహ్మాన్‌ తెలిపారు.

Updated Date - Nov 18 , 2025 | 12:07 AM