Share News

ఉగ్రవాదులు దాడి చేస్తే ఏం చేయాలి ?

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:33 AM

ఏపీ నిట్‌లో శుక్రవారం ఆక్టోపస్‌ కమెండోస్‌ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

ఉగ్రవాదులు దాడి చేస్తే ఏం చేయాలి ?
తుపాకులతో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న సాయుధ బలగాలు

నిట్‌లో ఆక్టోపస్‌ మాక్‌డ్రిల్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో శుక్రవారం ఆక్టోపస్‌ కమెండోస్‌ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేస్తే వారిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఆత్మరక్షణ ఎలా పొందాలి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా బాధి తులను ఎలా రక్షించాలి అనే దానిపై అవగాహన కలిగించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసే విధానంతోపా టు ఉగ్రవాదులు చొరబడిన భవనం, పరిసరాలు లోపలకు, బయటకు వెళ్లే మార్గాలు, భవనంలో ఎంతమంది చిక్కుకుపోయారు. బాంబులను అమర్చారా, సీసీ కెమరాల ద్వారా అనుమానితులను గుర్తించే వాటిపై అవగాహన కల్గించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్‌ కమాండోస్‌ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీసులు, రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌, హెల్త్‌ తదితర శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నారు. డీఎస్పీ విశ్వనాధ్‌, ఇన్‌స్పెక్టర్లు శివాజి, నీలకంఠ, సీఐ ఆదిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:33 AM