భీమవరంలో ‘మోగ్లీ’ యూనిట్ సందడి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:40 AM
భీమవరం మల్టీఫ్లెక్స్‌లో బుధవారం ‘మోగ్లీ చిత్ర యూని ట్’ సందడి చేసింది. హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి
భీమవరంటౌన్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : భీమవరం మల్టీఫ్లెక్స్‌లో బుధవారం ‘మోగ్లీ చిత్ర యూని ట్’ సందడి చేసింది. హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, కమెడియన్ హర్ష ప్రేక్షకులను కలిసి ముచ్చటించారు. మూడు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుండడంపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు హీరో హీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు
ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన హీరో, హీరోయిన్లు..
.తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్ సుమ అని, ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానమని, ఆమె కుమారుడు రోషన్ కనకాల అంటే అంతే అభిమానం చూపిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మోగ్లీ చిత్ర హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ ఎమ్మెల్యేను కలిశారు. వారికి స్వాగతం పలికి ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించారు.