Share News

కోర్టులో వైసీపీకి చుక్కెదురు

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:08 AM

ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై కోర్టుకు వెళ్లిన వైసీపీకి చుక్కెదురైందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు.

కోర్టులో వైసీపీకి చుక్కెదురు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ

మెడికల్‌ కళాశాలల వ్యవహారంలో జగన్‌ తీరుపై పితాని ఆగ్రహం

పెనుమంట్ర, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై కోర్టుకు వెళ్లిన వైసీపీకి చుక్కెదురైందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తీరుపై పితాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుమంట్రలో పల్లెపల్లెకు మన పితాని కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గత ఐదేళ్లలో మెడికల్‌ కళాశాల భవ నాల నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రలో మెడికల్‌ కాలేజీ కోసం కేవలం రూ.200 కోట్లు మాత్ర మే ఖర్చు చేసి రిషికొండ ప్యాలెస్‌ కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. మెడికల్‌ కళాశాలలు త్వరితగతిన పూర్తిచేయడానికే పీపీపీ మోడల్‌లో చేపట్టాల ని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే జగన్‌ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాల కొరకు మెడికల్‌ కళాశాలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం రూపాయి అయినా మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం మా నుకోవాలని హితవు పలికారు. సర్పంచ్‌ తాడిపర్తి ప్రియాంక, జవ్వాది సురేష్‌ చింతపల్లి మంగతాయారు, వెలగల బుల్లి రామిరెడ్డి, రుద్రరాజు వెంకటరామ రాజు, గంటా వాసు, కోయా వెంకట కార్తీక్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:08 AM