Share News

‘ఆదరణ’ పరికరాలు కొట్టేశారు

ABN , Publish Date - May 20 , 2025 | 12:43 AM

దెందులూరు నియోజకవర్గంలో ఆదరణ పథకంలో లబ్ధిదారులకు అందాల్సిన పరికరాలు వైసీపీ నేతలు తరలిం చుకుపోయారని, అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కలెక్టర్‌ వెట్రిసెల్విని కోరారు.

‘ఆదరణ’ పరికరాలు కొట్టేశారు
కలెక్టర్‌ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెట్టండి

కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతమనేని ఫిర్యాదు

ఏలూరు రూరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): దెందులూరు నియోజకవర్గంలో ఆదరణ పథకంలో లబ్ధిదారులకు అందాల్సిన పరికరాలు వైసీపీ నేతలు తరలిం చుకుపోయారని, అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కలెక్టర్‌ వెట్రిసెల్విని కోరారు. కలెక్టరేట్‌ సోమవారం జరిగిన పీజేఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. 2019కి ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తన నియోజకర్గం పరిధిలోని బీసీ సామాజిక వర్గాల వారి వృత్తి, ఉపాధికి సహకరించేలా ఆదరణ పథకంలో వాషింగ్‌ మిషన్లు, సెలూన్‌ చెయిర్లు వంటి పరికరాలు 90 శాతం సబ్సిడీపై అందించేలా చర్యలు చేపట్టామన్నారు. పరికరాలు లబ్ధిదారులకు పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయిందన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, అతని తండ్రి రామచంద్రరావు బీసీ కార్పొరేషన్‌ గోడౌన్‌లో ఉన్న పరికరాలను అక్రమంగా తరలించుకుపోయారన్నారు. లబ్ధిదారులకు అందాల్సిన పనిముట్లను అవినీతి అధికారుల సహకారంతో అక్రమంగా తరలించి అమ్ముకున్నారని చింతమనేని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బాధితులకు భరోసా ఇచ్చారు.

Updated Date - May 20 , 2025 | 12:43 AM