గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం : ఆరిమిల్లి
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:29 AM
సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 70 శాతంకు పైగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
అత్తిలి/తణుకు రూరల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 70 శాతంకు పైగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలిలో పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అత్తిలి నుంచి 2013లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. అత్తిలి మండలం తనకు సెంటిమెంట్ అని, 2024 ఎన్నికల్లో 17వేల ఓట్ల మెజార్టీ సాధించామని, దాదాపు 65శాతం ఓట్లు అత్తిలి మండలం ప్రజలు ఆదరించారని చెప్పారు. అత్తిలి మండల పార్టీ అధ్యక్షుడిగా పోలిశెట్టి చందు, కార్యదర్శిగా ఆల్తి అజయ్‌కుమార్‌లను ఎన్నుకు న్నారు. తణుకు నియోజక వర్గ పరిశీలకులుగా యర్రా వేణుగోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
తేతలిలో సీసీ రోడ్డు ప్రారంభం..
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. బుధవారం తేతలి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సరెళ్ల క్రాంతిప్రియ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.