Share News

మైనర్‌ చెరువులకు మోక్షం

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:26 AM

జిల్లాలో చిన్ననీటి పారుదల వ్యవస్థ అభివృద్దికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వైసీపీ జమానాలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ప్రక్షాళనకు టీడీపీ ప్రభుత్వం చర్యలకు ఉప క్రమించింది.

మైనర్‌ చెరువులకు మోక్షం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి

త్వరలో పనులు ప్రారంభం

జిల్లాలో చిన్ననీటి పారుదల వ్యవస్థ అభివృద్దికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వైసీపీ జమానాలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ప్రక్షాళనకు టీడీపీ ప్రభుత్వం చర్యలకు ఉప క్రమించింది. మరమ్మతులు, రీస్టొరేషన్‌, రీ కన్‌స్ట్రక్షన్‌ (ఆర్‌ఆర్‌ ఆర్‌) పథకం కింద జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లోని 1,548 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులుండగా 1,513 చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి

లక్షా 22వేల ఎకరాలకు ప్రయోజనం

జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల కింద లక్షా 22వేల850 ఎకరాల పంటలు సాగువుతున్నాయి. అయితే నీటి ప్రవాహా లకు అవరోధంగా ఈ చెరువులు అవసానకు దశకు చేరాయి. కృష్ణా జిల్లా నుంచి ఏలూరులో జిల్లాలో చేరిన చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆగిరపల్లి మండలాల్లోను 368 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల కింద 24,707 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ప్రధానంగా ఈ చెరువుల్లోకి 80 శాతం మేర వర్షాధారంతో నింపాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ ఏర్పాట్లు, వ్యవస్థ అభివృద్ధి చెందక సాగునీటి కష్టాలను రైతన్నలు ఎదుర్కొంటున్నారు. ఈ చెరువులకు దగ్గరగా తమ్మిలేరు, ఎర్రకాల్వ రిజర్వాయర్లు, కొవ్వాడ కాల్వ, జల్లేరు, పొగొండ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి ద్వారా చెరు వుల్లోని సమృద్ధిగా నీరు చేరాలంటే ఇప్పుడున్న మైనర్‌ ఇరిగే షన్‌ చెరువుల ప్రక్షాళనే శరణ్యంగా యంత్రాంగం భావిస్తోం ది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రయోగా త్మకంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది.

కేంద్రం 60.. రాష్ట్రం 40 శాతం వాటాలు

దశలవారీగా అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ప్రక్షాళన చేపట్టాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమి టీ (డీఎల్‌సీ) ఇటీవల నిర్ణయించింది. తొలి విడతగా పెద పాడు, దెందులూరు మోడల్‌గా స్టడీ చేసి.. ఇందులో 20 చెరువులను రూ.2కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ప్రతి పాదనలు సిద్ధం చేసి ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. చేపట్టే పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాల కింద నిధులను అందించి పూర్తి చేయాలని తీర్మానించారు.

ఏమేమి పనులు చేస్తారంటే..

చెరువుల సమీపంలో పేరుకుపోయిన చెట్ల తొలగింపు

ప్రధానంగా చెరువుల్లో పేరుకుపోయిన తూడు, చెత్త తొలగింపుతో పాటు సప్లయ్‌ ఛానల్స్‌, ట్యాంక్‌ బెడ్స్‌, కెనాల్స్‌ మరమత్తులు

ఇప్పుడున్న నీటి సరఫరా చేస్తున్న కాల్వలను విస్తరిస్తారు

స్లూయిజ్‌లకు మరమ్మతులు, కొత్తవి అమర్చడం

చెరువులకు నీటిని సరఫరా చేసే డ్రెయిన్లు బాగుచేత

నీటిని మళ్లించే డైవర్షన్‌ చెక్‌ డ్యామ్‌లు, ట్యాంకుల రిపేర్లు, నూతన నిర్మాణాలు. ఈ పనుల ద్వారా నిర్దిష్ట పంట అవసరాలకు అనుగుణంగా ప్రతీ నీటిబొట్టు సద్వినియోగం చే యడానికి అవకాశం ఉంటుంది.

ఇదొక బృహత్తర పథకం..

జలవనరులశాఖ ఎస్‌ఈ సీహెచ్‌ దేవప్రకాశ్‌

చాలా కాలంగా మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల మరమ్మతులు జరగలేదు. ‘ట్రిపుల్‌ ఆర్‌’ పథకంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దశలవారీగా అభి వృద్ధి చేస్తాం. వీటిపై జిల్లా స్థాయి కమిటీలో చర్చించి ఆ మేరకు ప్రతిపాద నలు ప్రభుత్వానికి పంపుతాం. ఇదొక బృహత్తర పథకంగా నిలుస్తుంది.

చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు : కలెక్టర్‌

జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులను అభివృద్ది చేయ డానికి ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలను పంపాలని కలె క్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,513 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులను ఆర్‌ఆర్‌ఆర్‌ (రిపేర్‌, రీస్టొరేష న్‌, రీ కన్‌స్ట్రక్షన్‌) కింద దశలవారీగా అభివృద్ధికి ప్రతిపాదన లు ఇవ్వాలని అధికారులతో శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కోరారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ దేవప్రకాష్‌, వ్యవసాయశాఖ జేడీ హాబీబ్‌ భాషా పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:26 AM