రాష్ట్రంలో 5821 ఆలయాల్లో పూజారులకు వేతనాలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:58 PM
గడిచిన ఐదేళ్ళల్లో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
పెనుగొండ, డిసెంబరు 21(ఆంద్రజ్యోతి):గడిచిన ఐదేళ్ళల్లో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. పెనుగొండ మండలం సిద్దాంతంలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న కేదారేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 5821 ఆలయాల్లో ప్రతి నెల 1వ తేదీకి పూజారీకి రూ.10వేలు దూప దీప నైవేద్యాలు కింద ఇవ్వడం జరుగుతం దన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం దీప దూప నైవేద్యాలలో 141 ఆలయాల్లో అమలు చేస్తున్నామన్నారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ నేపధ్యంలో పుష్కరఘాట్‌లను సందర్శించారు. వేదం చదివిన వేద పండితులు సంభావన కింద నెలకు రూ.3 వేలు ఇస్తున్నామన్నారు.
గ్రామ దేవతల ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు
ఆచంట: ఆచంట గ్రామ దేవతలు ముత్యాలమ్మ, గోగులమ్మ మహాలక్ష్మ మ్మ అమ్మవార్ల ఆలయాల పునర్నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు చేపడతామని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంత్రి ఆనం ఆచంట నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే పితాని తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆచంట రామేశ్వరస్వామి ఆలయానికి రూ.25 లక్షల నిధులతో ఆలయ గోపురానికి రంగులు వేయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, గొడవర్తి శ్రీరాములు, తమ్మినీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోడూరు: కవిటంలో రూ.1.96కోట్లతో పునర్నిర్మిస్తున్న సోమేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరిం చారు. ఈసందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. అనంతరం పోడూరు మండలం జగన్నాధపురం గ్రామంలో రూ.1.28లక్షలతో పునర్నిర్మిస్తున్న శ్రీఉ మారామేశ్వరస్వామి దేవాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా దేవస్ధానం చైర్మెన్ దశిక రామ్మోహన్ ఆలయ నిర్మాణానికి మరో రూ.40లక్షలు నిధులు కావాల్సి ఉందని నిధులు మంజూరు చేయా లని కోరుతూ స్ధానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ద్వారా విన్నవిం చారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్, రీజనల్ కమిషనర్ వేండ్ర త్రినాధ్‌రావు, ఆర్డీవో దాసి రాజు, దేవస్థానం చైర్మన్ గుడిమెట్ల నరేంద్రరెడ్డి, సర్పంచ్ చుట్టిగుళ్ల పూర్ణిమ పాల్గొన్నారు.