త్వరలోనే పెద్దచెరువు గండి పూడుస్తాం : మంత్రి
ABN , Publish Date - May 22 , 2025 | 12:29 AM
నూజి వీడు పెద్దచెరువు ఆక్ర మణలు తొలగించి చెరువు కట్టను పటిష్ఠం చేసేందుకు ప్రభు త్వపరంగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
త్వరలోనే పెద్దచెరువు గండి పూడుస్తాం : మంత్రి
నూజివీడు, మే 21 (ఆంధ్ర జ్యోతి) : నూజి వీడు పెద్దచెరువు ఆక్ర మణలు తొలగించి చెరువు కట్టను పటిష్ఠం చేసేందుకు ప్రభు త్వపరంగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పెద్దచెరువు గండి సమస్యపై ‘గండి పూడ్చండి’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన స్పం దించారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ వర్షాకాలంలో నూజివీడు పట్టణ వాసులకు పెద్దచెరువు నుంచి ఎటు వంటి సమస్యలు తలెత్తకుండా గండిపూడ్చే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు, ఇరిగేషన్‌శాఖ మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. నిధులు త్వరగా మంజూరు అయ్యేలా చేసి త్వరలో చెరువు ఆక్రమణలను తొలగించి చెరువుకట్టను పటిష్ఠం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని, ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో బిల్లులు జమ అవుతున్నాయన్నారు. సమావేశం లో నూజివీడు మండల టీడీపీ అధ్యక్షులు ముసునూరు రాజా, కౌన్సిలర్ టి.సాధనా స్రవంతి, టీడీపీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.