Share News

పంటలకు మెరుగైన ధరే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:06 AM

రైతులు తాము పండించే పంటలకు మెరుగైన ధరను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

పంటలకు మెరుగైన ధరే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లక్ష్యం
మొర్సిపూడి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి

ప్రతి మండలంలోనూ ‘నైబర్హుడ్‌ వర్క్‌ ప్లేస్‌’ ఏర్పాటు

పొలాల్లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుతో రైతులకు అదనపు ఆదాయం

మొర్సిపూడిలో రూ.102 కోట్లతో ఫుడ్‌పార్కు పనులకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన

నూజివీడు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):రైతులు తాము పండించే పంటలకు మెరుగైన ధరను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 60 పారిశ్రామిక ప్రాజెక్టులు, 51 మైక్రో స్మాల్‌ అండ్‌ మీడి యం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ)ల ప్రారంభోత్సవంలో భాగంగా నూజివీడు మండలం మొర్సిపూడిలో రూ.102 కోట్లతో ఏర్పాటు చేసే రమణ్‌సింగ్‌ గ్లోబల్‌ ఫుడ్‌పార్క్‌ పనులను మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా, మొర్సిపూడిలో మంత్రి పార్థసారథి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని వ్యవసాయపరంగా, ఆర్థికంగా, పారిశ్రా మికంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు విజన్‌ కలిగిన నాయకుడు రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు 20 కొత్త పారిశ్రామిక పాలసీలు తీసుకువచ్చామని, అందులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ఒకటన్నారు. . రమణ్‌సింగ్‌ గ్లోబల్‌ ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు ద్వారా 700 మంది యువతకు ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈనాటి యువత ఉద్యోగం కోసం నిరీక్షించడం నుంచి మరొకరికి ఉద్యోగం అందించే స్థాయికి తీసుకెళ్లడమే స్వర్ణాంధ్ర–2047 విజన్‌ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కోసం ప్రతీ మండ లంలోనూ ‘నైబర్హుడ్‌ వర్క్‌ ప్లేస్‌’ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు. పంట పొలాల్లో సాగుకు అడ్డులేకుండా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసి, రైతులకు మరింత ఆదాయం అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్‌ స్వర్ణాం ధ్ర– 2047 సాధనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు భాస్కరరావు, విజయ మిల్క్‌ డైరీ చైౖర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఎంపీపీ శిరీష ప్రముఖులు ప్రసంగిం చారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తకు ప్రభుత్వ ప్రోత్సాహ కాల చెక్కును మంత్రి అందించారు. అనంతరం మంత్రిని రమణ్‌సింగ్‌ గ్లోబల్‌ పుడ్‌ పార్కు యాజమాన్యం గోగినేని బాబు, గోగినేని పద్మావతి, బాలాజీ సత్కరించారు. జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీహరి, గృహనిర్మాణశాఖ పీడీ సత్యనారాయణ, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ బాబ్జి పాల్గొన్నారు.

సీహెచ్‌ పోతేపల్లిలో ఆగ్రోవెట్‌కు శంకుస్థాపన

ఆయిల్‌పాం దిగుబడిలో మలేషియాతో పోటీపడడం గర్వకారణం : ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల

ద్వారకా తిరుమల : మలేషియాతో పోటీ పడుతూ ఏలూరు జిల్లా రైతాంగం ఆయిల్‌పాం దిగుబడిని సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు. పరిశ్రమలు ఉపాధి కల్పనలో భాగంగా మండలంలోని సీహెచ్‌ పోతేపల్లిలో మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్‌గా గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జనసేన నేతలు పాల్గొన్నారు. తొలుత ఆయిల్‌పాం ఫాక్టరీకి విచ్చేసిన ఆయనకు అక్కడి సీఈవో, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆయిల్‌పాం ఫ్యాక్టరీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయల్‌పాం గెలల నాణ్యతను, వాటి నుంచి క్రూడ్‌ ఆయిల్‌ తయారయ్యే విధానాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకు న్నారు. అనంతరం నూతనంగా రూ.210కోట్లతో నిర్మించనున్న పరిశ్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావే శంలో ఆయన మాట్లాడూతూ ఈ పరిశ్రమ నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని ఔత్సాహిక పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం : ఎమ్మెల్యే చంటి

ఏలూరుటూటౌన్‌ : ఔత్సాహికులైన యువ పారిశ్రామికవేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో ఏపీ ఎంఎస్‌ఎంఈ అండ్‌ ఇంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌ మెంట్‌ పాలసీలో భాగంగా 2.2 ఎకరాల్లో రూ.14 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌, పారిశ్రామికవాడ నిర్మాణ పనులను మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్‌ఎంఎస్‌ఈ ప్రోగ్రాంకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు స్వశక్తితో స్వయం సమృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన ఎన్నో అవకాశాలు కల్పిస్తుందన్నారు. వీటిని ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరం నడిబొడ్డులో పార్కు ఏర్పాటుకు అనువైన స్థలం లభించడం నగరప్రజల అదృష్టమన్నారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు రావాలన్నారు. చిన్నతరహా పరిశ్రమల ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపడతుందన్నారు. ఇడా చైర్మన్‌ శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పార్థసాఽరథి ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సాల్మన్‌రాజు, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భానుప్రతాప్‌, తహసీల్దార్‌ గాయిత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:06 AM