Share News

గోవులను వీధుల్లో వదలడం మానుకోవాలి : మంత్రి నిమ్మల

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:21 AM

పట్టణంలో గోవులను వీధుల్లో వదిలి వేయడం యజమానులు మానుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సూచించారు.

గోవులను వీధుల్లో వదలడం మానుకోవాలి : మంత్రి నిమ్మల
ఆవుల కోసం ఏర్పాటు చేసిన గరుకు స్తంభాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రామానాయుడు

పాలకొల్లు టౌన్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గోవులను వీధుల్లో వదిలి వేయడం యజమానులు మానుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సూచించారు. యునైటెడ్‌ కాపు వనిత క్లబ్‌ పర్మినెంట్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణంలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోవుల గరుకు స్తంభాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. తప్పనిసరిగా వదిలే వారు సైతం గోవులను తమ ఇళ్ల వద్దనే కట్టుకోవాలని సూచించారు. పట్టణంలో జక్కంపూడి మధన్‌, అల్లంవాణి యడ్లబజారులోనూ, డాక్టర్‌ ముచ్చర్ల సంజయ్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా, కటికి అర్చన పూలపల్లి టర్నింగ్‌ వద్ద, తమ్మిరెడ్డి త్రినాధేశ్వరి శ్రీనివాస డీలక్స్‌ ఎదురుగా, డాక్టర్‌ వావలి ఉమాదేవి విశ్వమానవ వేదిక వృద్ధాశ్రమం వద్ద ఆవుల గరుకు స్తంభాలను ఏర్పాటు చేశారు. డాక్టర్‌ ముచ్చర్ల సంజయ్‌, పెనుమాక రామమోహన్‌, జక్కంపూడి మదన్‌, మద్దాల వాసు, పోకల రాము, జక్కంపూడి కుమార్‌, రావూరి అప్పారావు, కానూరి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

గోవులను సంరక్షించాలని ర్యాలీలు

భీమవరంటౌన్‌/పాలకొల్లు అర్బన్‌ : గోవధ మహాపాపమని, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్‌ కె.ముర ళీకృష్ణ, డాక్టర్‌ పి.పండరీబాబు, డాక్టర్‌ కె.హేమ, డాక్టర్‌ ఎ.సత్యనారాయణ, డాక్టర్‌ సుధీర్‌ బాబు అన్నారు. భీమవరం పట్టణంలోని నాచువారి సెంటర్‌లో పశు సంవర్ధక శాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అక్రమంగా జంతు వధ చేసినా.. రవాణా చేసిన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పాలకొల్లు పట్టణంలో గోవులను సంరక్షిచుకోవాలని కోరుతూ వీమెచ్‌పీ, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం పట్ట ణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ నాయకురాలు టి.సునీత మాట్లాడుతూ పవిత్రమైన గోవులను ఇటీవల దుండగులు దొంగిలిస్తున్నారు. క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా బస్టాండ్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీ చేరుకుని తహసీల్దార్‌ దుర్గ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు రావూరి సుధ, జక్కంపూడి కుమార్‌, కొల్లి కొండ ప్రసాద్‌, గాదె వెంకన్న, మల్లికార్జునరెడ్డి, బి.సత్యజిత్‌కుమార్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎన్‌. భాగ్యలక్ష్మి, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:21 AM