Share News

జెట్‌ స్పీడ్‌తో నిమ్మల

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:13 AM

జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జెట్‌ వేగంతో పనిచేస్తున్నారు.

జెట్‌ స్పీడ్‌తో నిమ్మల

ఫైల్‌ వచ్చిన రెండు రోజులకే క్లియరెన్స్‌..

మూడు నెలల్లో 1,546 ఫైల్స్‌ పరిష్కారం

రాష్ట్ర మంత్రుల్లో రెండో ర్యాంకు..

అదే బాటలో జిల్లా కలెక్టర్‌ నాగరాణి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జెట్‌ వేగంతో పనిచేస్తున్నారు. తమ శాఖలోని ఫైళ్లను పరిష్కరించడంతో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, సచివాలయాల్లోని ఐఏఎస్‌ అధికారులు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు గడచిన మూడు నెలల్లో ఫైళ్ల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. తదనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో ఫైళ్లు పరిష్కరించడంలో మంత్రుల పనితీరును భేరీజు వేసినపుడు మంత్రి నిమ్మల 23వ స్థానంలో నిలిచారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రభుత్వం ఒక అంచనా వేసింది. వైసీపీ హయాంలో పరిష్కారానికి నోచుకోని ఫైల్స్‌ అన్ని జలవనరుల శాఖలో పేరుకుపోయాయి. ఫలితంగా అప్పట్లో నిమ్మల వెనుకబడ్డారు. తాజాగా గడచిన మూడు నెలల్లో ఫైల్స్‌ పరిష్కారంపై లెక్కలు చూ సింది. ఈ సారి నిమ్మల 1,546 ఫైల్స్‌ను వేగవం తంగా పరిష్కరించారు. రెండు రోజుల వ్యవధిలోనే తన వద్దకు వచ్చిన ఫైల్స్‌ను కొలిక్కి తెస్తున్నారు. ఇందులో ఈసారి రెండో స్థానంలో నిలిచారు. వాస్తవంగా మంత్రి నిమ్మల నిత్యం అందుబాటులో ఉం టూ సామాన్యులతో మమేకమవుతారు. రెండో స్థానంలో నిలవడంపై క్యాడర్‌లో జోష్‌ నెలకొంది.

కలెక్టర్‌ పనితీరు భేష్‌

జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పనితీరు బాగానే ఉంది. కలెక్టర్‌ సైతం సగటున రెండు రోజుల్లోనే ఫైల్స్‌ను పరిష్కరించి ముందు వరుసలో నిలిచారు. మూడు నెలల్లో కలెక్టర్‌ వద్దకు 409 ఫైల్స్‌ వచ్చాయి. వచ్చిన ప్రతి ఫైల్‌ను రెండు రోజుల్లోనే పరిష్కరించారు.

అదే సమయంలో జాయింట్‌ కలెక్టర్‌టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఒక్కో ఫైల్‌ పరిష్కారానికి సగటున ఐదు రోజులు సమయం పట్టింది. గడచిన మూడు నెలల్లో జేసీ వద్దకు ఏకంగా 1,397 ఫైల్స్‌ రావడంతో కాస్త జాప్యం జరిగింది. మొత్తంగా చూస్తే వీరి పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.

Updated Date - Dec 11 , 2025 | 12:13 AM