Share News

పారిశుధ్యానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:54 AM

‘కూటమి ప్రభుత్వం పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లింది. రాష్ర్టాన్ని డంపింగ్‌ యార్డులా తయారు చేసింది. రోజుకు 50 వేల టన్నుల చెత్తను తొలగిస్తున్నాం. భూమిపైనే కాదు.. లోపల మరో 15 లక్షల టన్నుల చెత్త ఉంది. నవంబరు నెలాఖ రుకు దానిని తొలగించే చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు.

   పారిశుధ్యానికి ప్రాధాన్యం
ఏలూరులో టిడ్కో గృహాలను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ, చిత్రంలో ఎమ్మెల్యే చంటి, కలెక్టర్‌ వెట్రిసెల్వి, మేయర్‌ నూర్జహాన్‌

మంత్రి నారాయణ

ఏలూరు టూ టౌన్‌, సెప్టెం బరు 17(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లింది. రాష్ర్టాన్ని డంపింగ్‌ యార్డులా తయారు చేసింది. రోజుకు 50 వేల టన్నుల చెత్తను తొలగిస్తున్నాం. భూమిపైనే కాదు.. లోపల మరో 15 లక్షల టన్నుల చెత్త ఉంది. నవంబరు నెలాఖ రుకు దానిని తొలగించే చర్యలు తీసుకుంటాం’ అని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. పోణంగి లోని డంపింగ్‌ యార్డును, ఏలూరు టిడ్కో గృహాలను సందర్శించారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జూన్‌ నాటికి దశల వారీగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ వైసీపీ హయాంలో డంపింగ్‌ యార్డులోని చెత్తను కాల్చి పర్యావరణానికి హాని కలిగించారని, దీనివల్ల చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంలో చెత్తను ఎరువుగా తయారు చేసి వినియోగిస్తున్నామన్నారు. మేయర్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ పోణంగి డంపింగ్‌ యార్డులో ఇప్పటికే 63 శాతం చెత్తను తొలగించామన్నారు. ఈ నెలాఖరు నాటికి మిగిలిన చెత్తను పూర్తిగా తొలగి స్తామన్నారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌, కమిషనర్‌ భానుప్రతాప్‌, డిప్యూటీ కమిషనర్‌ శివారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఉమా మహేశ్వరరావు, కోఅప్షన్‌ సభ్యులు పెదబాబు, ఇడా చైర్మన్‌ శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పార్థసారఽథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు. తొలుత ఏలూరు వచ్చిన మంత్రికి కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చంటి, నాయకులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.

Updated Date - Sep 18 , 2025 | 12:54 AM